
వరదలతో ప్రజలు, సహాయాక చర్యలలో ప్రభుత్వాలు అల్లాడుతుంటే వైసీపీ మాత్రం జగన్ కు ఎలివేషన్లు ఇచ్చే పనిలో బిజీగా ఉంది. బెంగుళూర్ నుండి ఇడుపులపాయ చేరుకున్న వైస్ జగన్ తన తండ్రి వైస్సార్ వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యి నేరుగా విజయవాడ కృష్ణ లంక ప్రాంతాన్ని సందర్శించారు.
అయితే విజయవాడలో ఎన్నో ప్రాంతాలు ముప్పు బారిన పడితే జగన్ మాత్రం కృష్ణలంకనే ఎంచుకోవడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారా.? ఇక్కడే ఉంది వైసీపీ నీచ రాజకీయం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైస్ జగన్ చేతుల మీదుగా ఈ రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవం జరిగింది.
అయితే పునాది రాయి ఎవరేసినా, శంకుస్థాపన కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా ఓపినింగ్ రిబ్బన్ కటింగ్ మాత్రం జగన్ చేతుల మీద జరిగింది కాబట్టి ఈ వాల్ నిర్మాణ క్రెడిట్ మొత్తం వైసీపీ కే చెందాలి, జగన్ కే దక్కాలి అని వైసీపీ సోషల్ మీడియా రెండు రోజుల నుండి ఈ వాల్ చిత్రాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ వైరల్ చేస్తుంది.
వాల్ నిర్మాణం పూర్తి చేసి మా బతుకులకు వెలుగు నింపిన దేవుడు జగన్ అంటూ కృష్ణలంక ప్రజలంతా జగన్ కు రుణపడి ఉండాలి అనేది వైసీపీ రాజకీయం. జగన్ కట్టిన రిటైనింగ్ వాల్ వల్లనే ఈనాడు కృష్ణలంక ప్రజల ప్రాణలు నిలిచాయి కాబట్టి ‘కృష్ణలంక మొనగాడు’ జగన్ అన్నట్టుగా వైసీపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే ఈ వాల్ నిర్మాణం మొదలు పెట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ వాల్ నిర్మాణం అంతిమ దశకు చేరుకుంది. దీనితో 2014 లో సుమారు 164 కోట్ల వ్యయంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం భారీ వరదల దాటికి కూడా తట్టుకునేలా 2.1 కి.మీ రక్షణ గోడను నిర్మించిందంటూ వైసీపీకి కౌంటర్ వేసింది టీడీపీ. అలాగే 2019 కు ముందే నిర్మించిన రీటైనింగ్ వాల్ ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు.
దీనితో ఇన్నాళ్లు శవ రాజకీయాలు చేసిన జగన్ ఇప్పుడు వరద రాజకీయాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. వాల్ నిర్మాణ క్రెడిట్ ల మీద పెట్టిన శ్రద్ద వరద బాధితుల సహాయ చర్యల మీద పెడితే హోదా కోసం కోర్టుల తలుపు తట్టాల్సిన అవసరం జగన్ కు ఇక ముందు రాకపోవచ్చు.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…