
కానీ ప్లీనరీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వేదికపై నుంచి ప్రసంగించిన ప్రతీ ఒక్కరూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, మీడియాను తిట్టిపోస్తూనే ఉన్నారు. కోట్లు ఖర్చు చేసి టిడిపిని, చంద్రబాబు నాయుడుని తిట్టుకొనేందుకే ప్లీనరీని పెట్టుకొన్నారా?అనే స్థాయిలో వైసీపీ నేతల తిట్ల దండకాలు కొనసాగాయి.
ప్లీనరీలో అందరూ జగన్ భజన చేసి, సంక్షేమ పధకాల డప్పు బాగానే కొట్టుకొన్నారు. ఒక్కో అంశంపై తీర్మానాలు చేసుకొని ఆమోదించుకొన్నారు కూడా. అయితే ఈ మూడేళ్ళలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు లభించాయనే విషయం ప్రస్తావించనే లేదు. ప్లీనరీలో ప్రధానంగా నాలుగు అంశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1. విజయమ్మను బయటకు సాగనంపడం; 2. జగన్ జీవితకాల అధ్యక్షుడు పట్టాభిషేకం చేసుకోవడం; 3. టిడిపిని చంద్రబాబు నాయుడుని పోటీలు పడి తిట్టి పోయడం; 4. సంక్షేమ పధకాలు డప్పు వాయించుకోవడం.
ఈరోజు ప్లీనరీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మనిషికి క్యారక్టర్ ఉండాలి. క్రెడిబిలిటీ ఉండాలి. ప్రజలకు మంచి చేసే చిప్ గుండెల్లో ఉండాలి. అవన్నీ చంద్రబాబు నాయుడుకి లేవు నాకు మాత్రమే ఉన్నాయన్నట్లు మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజలకు మంచి చేయాలనే తపన ఏమాత్రం లేదని జగన్ విమర్శించారు.
మంచిదే… చంద్రబాబు నాయుడుకి 16 నెలల జైలు క్యారెక్టర్ లేదు. సమైక్యాంద్రా కోసం తెలంగాణ పార్టీ నేతలను రోడ్డున పడేసిన క్రెడిబిలిటీ లేదు. రాజధాని అమరావతి, పోలవరంపై మడమ తిప్పలేకపోయారు. కూతవేటు దూరంలో రాజధానికి భూములిచ్చి త్యాగాలు చేసిన రైతన్నలు ఏడాదిన్నరగా ఆందోళనలు చేస్తున్నా పలకరించకపోవడం చాలా గొప్ప విషయం. ఆ త్యాగమూర్తులపై పోలీసుల చేత కేసులు పెట్టించడం ఇంకా గొప్ప విషయం.
తల్లిని, చెల్లిని బయటకు సాగనంపి పట్టాభిషేకం చేసుకోవడం వైసీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవలసిన గొప్ప విషయం. కరెంటు కోతలు సరే… చివరికి వైసీపీ గొప్పగా చెప్పుకొంటున్న పధకాలకు కూడా కోతలు పెట్టాలనే ఆలోచనే చాలా గొప్ప ఆలోచన. మడమ ఉన్నదే తిప్పడానికి కనుక తిప్పుతూనే ఉండాలి. తప్పదు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…