
సదరు కథనాలను చూసిన వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని ‘రిలయన్స్ ఫ్రెష్’ తదితర ఔట్ లెట్లపై విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో రిలయన్స్ కు 12 కోట్ల మేర నష్టం వాటిల్లింది. సదరు మీడియా ఛానల్స్ కధనాల వలనే ఈ దాడులు జరిగాయంటూ ఆ మూడు ఛానెళ్లపై నాటి ప్రభుత్వం ‘దేశద్రోహం’ కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల దర్యాప్తు… రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీకి బదిలీ అయ్యాయి.
ఈ క్రమంలో సాక్షి టీవీ ప్రసారం చేసిన వార్త కథనాల ఆధారంగానే తాము కూడా ఆ వార్తలను ప్రసారం చేశామని చెప్పిన టీవీ 5, ఎన్టీవీ యాజమాన్యాలు తమపై నమోదైన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు రాశాయి. సాక్షిలో ప్రసారమైన కథనాలు నిజమో? కాదో? సరిచూసుకోకుండా కథనాలు ప్రసారం చేయడం తప్పేనని ఆ ఛానెళ్లు క్షమాపణలు కూడా చెప్పాయి. దీంతో ‘సారీ’ చెప్పిన ఆ రెండు ఛానెళ్లను కేసు నుంచి తప్పిస్తూ సీఐడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే క్రమంలో తమపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని సాక్షి టీవీ యాజమాన్యం తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసింది. సీఎంఓ నుంచి ఈ లేఖను అందుకున్న సీఐడీ అధికారులు సాక్షి టీవీపై కేసు ఎత్తివేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీఎంఓకు పంపిన లేఖలో… ‘దేశద్రోహం కేసు నుంచి సాక్షి టీవీని తప్పించడం’ కుదరదని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో సాక్షి టీవీ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కేసులో సాక్షి టీవీ సీఈఓ, ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులు నిందితులుగా ఉన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సంచలన కధనాల కోసం ప్రాకులాడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని మీడియా వర్గీయులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
For the first time in a long time, there is genuine curiosity about whether Prabhas…
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…