
నూతన సంవత్సరానికి పెళ్లి వార్తతో స్వాగతం పలికారు YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల. తన కుమారుడైన వైస్ రాజారెడ్డి వివాహం పై వస్తున్న వార్తలకు అధికార ముద్ర వేస్తారు వైస్ షర్మిల.
అట్లూరి ప్రియతో తన కుమారుడి వివాహం నిర్ణయించడం జరిగిందని, ఈ నెల 18 న వీరి నిశ్చితార్ధ వేడుక జరగనున్నట్లు షర్మిల తన X లో పోస్ట్ చేశారు. అలాగే ఫిబ్రవరి 17 న వివాహ తంతు ముగుస్తుందని తెలియచేసారు.
రేపు కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ ను సందర్శించనున్న షర్మిల ఏపీలో తన రాజకీయ ప్రవేశం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం.
అయితే ఆమె ఇచ్చే క్లారిటీతో వైసీపీ రాజకీయ ముఖ చిత్రంలో చాల మార్పులే చోటు చేసుకునే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలయ్యింది. ఏపీ రాజకీయాలలో షర్మిల రీఎంట్రీ అనే వార్త ఒక కాంగ్రెస్ పార్టీకి ఉపిరిపోస్తే మరో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసినట్టే అనే భావనలో ఉన్నారు రెండు కాంగ్రెస్ పార్టీల నేతలు.
వైస్ షర్మిల తన రాజకీయ రీఎంట్రీ తో ఎవరికీ ఊపిరి పోస్తారో ఎవరి ఊపిరి తీస్తారో అనే టెన్షన్ లో ఇరు పార్టీల నేతలను ఉంచి కుమారుడి పెళ్లి వార్తతో వైస్ కుటుంబానికి అభిమానులుగా ఉన్న వారికీ మాత్రం దిల్ కుష్ చేసే వార్త చెప్పారు. “కొత్త సంవత్సరం, కొత్త కోడలు, కొత్త రాజకీయాలతో”… 2024 అదిరిందమ్మా షర్మిల అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వైస్ అభిమానులు.
Mithun Chakraborty is playing villain role in Rajinikanth's Jailer 2. But before signing the film,…
Success may have changed Vijay Deverakonda’s life, but it hasn’t changed the way he thinks.…