
అంతే కాకుండా పార్టీ విలీనం దాదాపు ఖరారు అయ్యిందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. షర్మిల ను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిగా వ్యవహరించారు. పలుమార్లు డీకే… షర్మిల తో బెంగుళూరు లో భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు షర్మిల ఆయన సపోర్ట్ తో కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరుకున్నారు.
అయితే షర్మిలను పార్టీలోకి తీసుకునేందుకు అధిష్టానం కొన్ని కండిషన్స్ పెట్టినట్టు కూడా సమాచారం. గతంలో షర్మిల పాలేరు నుండి పోటీ చేయాలని అనుకున్నారు. దాదాపు అక్కడ నుండే షర్మిల పోటీ ఖరారు అయ్యింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం షర్మిల కు సికింద్రాబాద్ నుండి పోటీ చేయాలనే కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మొదట పొత్తుల దిశగా చర్చలు జరిగినా ఆ తరవాత పార్టీ విలీనం కు షర్మిల ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీలోకి తీసుకున్నప్పటికీ ఏపిలో కూడా పనిచేయాలని షర్మిలను అధిష్టానం ఒప్పించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల తరవాత ఏపీలో స్టార్ కాంపెయినర్ గా వ్యవహరించాలని షర్మిలకు సూచించినట్టు తెలుస్తోంది. దాంతో ఏపీలో షర్మిల సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ కండిషన్స్ అన్నింటికీ షర్మిల కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. దాంతో రాజన్న బిడ్డ పార్టీ విలీనం పై ఎలాంటి ప్రకటన చేస్తుంది అన్నది ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ…
Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…