గౌరవం ఇవ్వండి…తీసుకోండి..!

వైస్ జగన్, వైస్ షర్మిల మధ్య జరుగుతున్న అలుపెరుగని రాజకీయ యుద్ధంలో అనేకమంది వైస్ కుటుంబ సభ్యుల నుండి వారి మద్దతుదారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. ఈ యుద్ధంలో రాజకీయాలకు సంబంధం లేని వారు, వైస్ కుటుంబంతో సాన్నిహిత్యం లేని వారు కూడా ఒక్కోసారి ఈ విమర్శలను మోయాల్సి వస్తుంది.

ఇందులో సినీ ఇండస్ట్రీలో అత్యంత సౌమ్యుడిగా పేరొందిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నలిగిపోతున్నారు. పనికి దగ్గరగా, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ప్రభాస్ పేరు వైసీపీ లో పదేపదే వినిపిస్తుంది. షర్మిలను టార్గెట్ చేయడానికి వైసీపీ వారు, వారి నుండి తనను తానూ డిఫెన్స్ చేసుకోవడనికి షర్మిల ప్రభాస్ పేరు బయటకు తీస్తున్నారు.

ADVERTISEMENT

అయితే నిన్న ప్రెస్ మీట్లో షర్మిల, ప్రభాస్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం గురించి ముసలి కన్నీరు కార్చిన జగన్ వ్యాఖ్యల పై మండిపడ్డ షర్మిల హీరో ప్రభాస్, తన పై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ప్రభాస్ ‘ఎవడో’ నాకు తెలియదుగా అంటూ డార్లింగ్ ను అగౌవరవంగా సంబోధించారు.

దీనితో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనాంశంగా మారిపోయాయి. గతంలోను చెప్పాను, ఇప్పుడు చెపుతున్నాను, నా బిడ్డలా మీద ప్రమాణం చేసి చెపుతున్న నాకు ప్రభాస్ ఎవడో ఇప్పటికి తెలియదు అంటూ ఆవేశంగా ప్రసంగించారు. తన అన్న తన మీద వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఈ ఉన్మాద చర్యలకు షర్మిలకు మద్దతుగా నిలిచిన వారు సైతం షర్మిల ప్రభాస్ పట్ల మాట్లాడిన మాటల పై మండిపడుతున్నారు.

ఒకరి నుండి గౌరవాన్ని ఆశించిన వారు ఎదుటి వారికి కూడా గౌరవం ఇవ్వాలి గా అంటూ షర్మిల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రభాస్ ఎవరో తెలియకుండానే ప్రభాస్ బాహుబలి సినిమాలో ఉండే కాలకేయ సైన్యం గురించి షర్మిలకు ఎలా తెలిసింది అంటూ ఎదురు షర్మిల మీద సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి.

మరి ఈ కాంట్రవర్సీ కి సారీ తో షర్మిల ఫుల్ స్టాప్ పెట్టి అన్న జగన్ కు తనకు తేడా ఉండి అని నిరూపించుకుంటారా.? లేక అన్న మాదిరే ఇతరులకు మర్యాద, గౌరవం ఇవ్వలేని వ్యక్తిగా మిగిలిపోతారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

4 hours ago

After Vijay, Will Nayanthara Enter Tamil Nadu Politics?

Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…

5 hours ago