దత్త పుత్రుడి’కి స్వస్తి పలికి ‘దత్త పుత్రిక’కు నాంది పలుకుతారా..?

జగన్ రాజకీయ ప్రస్తవాన్ని ఒక్కసారి గమనిస్తే ఎప్పుడు తన పార్టీని లైవ్ లైట్ లో ఉంచడానికి, నిత్యం ప్రజల నోళ్ళల్లో నానడానికి ఏదోఒక వివాదాన్ని తలకెత్తుకుని దాన్నే వైసీపీ అస్త్రంగా మార్చుకుంటారు. గడిచిన పదేళ్లుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ‘దత్తపుత్రుడు’ అంటూ సంబోధిస్తూ బాబుతో ముడిపెట్టి విమర్శలు చేసేవారు జగన్ అండ్ కో.

అయితే వారి పదేళ్ల పైశాచిక ఆనందానికి గాని ఐదేళ్లు 151 సీట్లతో అధికార అందలం ఎక్కితే, మరో ఐదేళ్లు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దీన స్థితికి చేరుకున్నారు. అయినా వైసీపీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడు పవన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి బాబు ను అడ్డుపెట్టుకున్న జగన్ ఇప్పుడు షర్మిలను టార్గెట్ చేయడానికి మళ్ళీ బాబు పేరుని వాడుకుంటున్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడి పల్లకి మోయడానికి పవన్ రాజకీయం చేస్తున్నారని నాడు విమర్శించిన వైసీపీ, బాబు చేతిలో పావుగా మారి జగన్ ను జైలుకు పంపడానికి సిద్దమైన షర్మిల అంటూ నేడు షర్మిల, బాబు మీద నిందలు మోపుతున్నారు. అయితే గత పదేళ్ల వైసీపీ అరాచకానికి తమ ఓటుతో బాబు, పవన్ ల మీద వైసీపీ చేసిన రాజకీయ విమర్శల గొంతు నొక్కారు ఏపీ ప్రజానీకం.

ఇక చేసేదేమి లేక ఇన్నాళ్లు పవన్ ను దత్త పుత్రుడు అన్న నోటితోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అంటూ గౌరవంగా సంబోధిస్తున్నారు జగన్ అండ్ కో. అయితే ఇప్పుడు వీరి లక్ష్యం పవన్ నుంచి షర్మిలకు మారిందా అన్నట్టుగా కనీసం వైస్సార్ కుమార్తె అనే కనీస కనికరం కూడా లేకుండా షర్మిల మీద రెచ్చిపోతున్నారు జగన్ భజన బృందం.

దీనికి తన సొంత సాక్షికి తోడు మరికొన్ని బ్లూ మీడియాలు మద్దతు పలుకుతున్నాయి. అలాగే జగన్ కనుసైగతో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు సోషల్ మీడియాలో వైస్సార్ బిడ్డ షర్మిల మీద జగన్ అండ్ కో చేస్తున్న మాటల దాడికి చెక్ పెట్టడానికి వైస్సార్ సతీమణి, జగన్ తల్లి విజయలక్ష్మి కూడా ముందుకు రాలేకపోతున్నారు.

ఒకవేళ సాహసించి జగన్ కు వ్యతిరేకంగా, షర్మిలకు మద్దతుగా విజయలక్ష్మి ఒక్క ప్రకటన చేసినా ఆ తరువాత ఈ వయస్సులో తానూ ఎదుర్కోవాల్సిన పరిణామాలను వైస్సార్ అభిమానులు కూడా ఉహించలేరనే విషయాన్ని విజయలక్ష్మి ఉహించి ఉండవచ్చు. అందుకే మీడియా ముందుకు రావడానికి విజయలక్మి వెనకడుగు వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. .

చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో షర్మిల పని చేస్తుందని, వైస్సార్ ప్రత్యర్థితో చేతులు కలిపి జగన్ మీద రాజకీయ దాడికి యత్నిస్తోందని షర్మిల మీద పేట్రేగిపోతున్నారు వైసీపీ కాలకేయ సైన్యం. అలాగే అన్న ఆస్తుల కోసం చెల్లి షర్మిల కూడా బాబు మనిషిగా మారిపోయారంటూ పేర్ని నాని మొదలుకుని, అంబటి, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల, జగన్ వరకు…ఇలా వైసీపీలో ఉన్న ప్రముఖ నాయకులంతా వైస్సార్ బిడ్డను బాబు దత్తపుత్రికగా చిత్రీకరించే ప్రయత్నం మొదలుపెట్టారు.

గత ఐదేళ్లు పవన్, బాబు ను టార్గట్ గా చేసుకుని ‘దత్త పుత్రుడు’ అంటూ వచ్చిన ఒక్క అవకాశాన్ని చేచేతుల జారవిడుచుకున్న జగన్ ఇప్పుడు షర్మిల, బాబు ను టార్గెట్ చెయ్యడం మొదలుపెట్టారు. దీని ఫలితం తో జగన్ పతనం, వైసీపీ గ్రాఫ్ ఏమేరకు దిగజారనుందో మరికొద్ది కాలంలోనే వైసీపీ గ్యాంగ్ కు క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. అప్పటి వరకు వైసీపీ పాపాల చిట్టా లెక్కించడమే సరి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

36 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

45 minutes ago