
జగనన్న బాణం మరోసారి గురి తప్పింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేయబోతే వీలుపడలేదు. తర్వాత 119 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించి అభ్యర్ధులు దొరకకపోవడంతో ఆ ఆలోచన విరమించుకొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసమే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నామని చెప్పడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని చెప్పిన వైఎస్ షర్మిల, ఇవాళ్ళ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగి తన రాజకీయ ఆజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకొన్నారు.
సోమవారం హైదరాబాద్, లోటస్ పాండ్ నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ, “ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయిన దొంగ. ఈ మాట నేను అనడం లేదు సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు అలాంటి దొంగలు ఎన్నటికీ ముఖ్యమంత్రులు కాలేరు. ఎవరో వచ్చి మా నెత్తిన కిరీటం పెడతారని మేము ఎదురుచూడటం లేదు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని చెప్పిన వైఎస్ షర్మిల, ఎన్నికల ప్రచారం ఊపందుకొన్న వేళ అకస్మాత్తుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యకలిగిస్తుంది.
ఆయన కారణంగానే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేకపోయింది. ఎన్నికలలో పోటీ చేయలేకపోయింది. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. అందుకే ఆమె రేవంత్ రెడ్డిపై ఈవిదంగా విరుచుకుపడుతూ, ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకొనేందుకు అప్పుడే పావులు కదుపుతున్నట్లు భావించవచ్చు.
అయితే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తప్పు ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదటే ఆమెను వద్దని చెప్పేశారు. అయినప్పటికీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి దొడ్డి దోవలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించి మళ్ళీ భంగపడ్డారు. ఆ ఉక్రోషంతోనే రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి ‘దొంగలు ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని’ చెప్పి, ఏపీలో వైసీపి నేతలు కూడా భుజాలు తడుముకొనేలా చేశారు కదా?
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…
బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు…