Telugu

షర్మిల కు కాంగ్రెస్ కాకుండా ప్రత్యామ్నాయం ఉందా.?

గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లారనే చెప్పాలి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో అటు కూటమి ప్రభుత్వాన్ని ఇటు వైసీపీ పార్టీని విమర్శించే షర్మిల గత కొన్ని రోజులుగా రాజకీయంగా ఇనాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.

అయితే ఈ అజ్ఞాతం వెనుకున్న అసలు కారణాలేమిటి అనేది ఇప్పటికి బయటకు రాలేదు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ళు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిన షర్మిల, ఆ తరువాత కుమార్తె అంజలి రెడ్డి నిశ్చితార్ధ వేడుకలతో మరికొన్నాళ్లు రాజకీయాలకు దూరం జరిగినప్పటికీ ఆ తరువాత కూడా షర్మిల గతంలో మాదిరి రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు.

ADVERTISEMENT

స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఇటు కూటమి అటు వైసీపీ సై అంటే సై అంటూ యుద్దానికి సిద్దమవుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన బీసీ 34% రిజర్వేషన్ అంశం పైన కానీ, వైసీపీ లేవనెత్తిన సర్ ప్రక్రియ వివాదం పై కానీ కాంగ్రెస్ నుంచి ఎటువంటి ప్రకటనలు, అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

ఒకపక్క కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండి కూటమి సభ్యులతో కలిసి సీఈసీ చీఫ్ జ్ఞానేశ కుమార్ రాజీనామా కై ఢిల్లీ వేదికగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇటువంటి సందర్భంలో కూడా షర్మిల రాజకీయ అజ్ఞాతంలోనే కనిపిస్తున్నారు.

అయితే షర్మిల ఈ అజ్ఞాతం వెనుక కాంగ్రెస్ – వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య రాజకీయ చర్చలు అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కారణంగా ఉన్నాయా.? లేదా కాంగ్రెస్ తో తన రాజకీయ ఎదుగుదల అసాధ్యమనే భావనలోకి షర్మిల వచ్చారా.? అయితే ఏపీలో షర్మిల కు కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపిస్తుందా.?

వైఎస్ఆర్ కుమార్తెగా టీడీపీ కండువా కప్పుకోలేదు, జనసేన జెండా పట్టుకోలేరు, బీజేపీ కమలం ధరించలేరు…అయితే కాంగ్రెస్ లేదంటే జగన్ తో ఉన్న విభేదాలను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప షర్మిలకు రాజకీయంగా మరోదారి కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఏపీలో తిరిగి రాజకీయంగా ఎదుగుతుంది అనే కనీస ఆశ కూడా లేని కాంగ్రెస్ పార్టీతో షర్మిల ఇంకెంతకాలం ఒంటరి పోరాటం చెయ్యగలరు.? క్షేత్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులు కూలిపోవడంతో తిరిగి పార్టీని ఏపీలో రాజకీయంగా యాక్టీవ్ చెయ్యడం షర్మిల కు సాధ్యమయ్యే పనేనా.?

అందుకే షర్మిల అడపాదప కాంగ్రెస్ పార్టీ కండువాతో కనిపిస్తూ తానూ కూడా రాజకీయాలలోనే ఉన్నాను అనే భావన కలిగిస్తున్నారా.? వైసీపీ శ్రేణులకు ముఖ్యంగా జగన్ కి ఎప్పటికప్పుడు తన ఉనికిని తెలియచేస్తూ తానూ వైసీపీ కి ఎప్పటికి ఒక పొలిటికల్ హెచ్చరికలా కనిపించే ప్రయత్నం చేస్తున్నారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సీజేపీ…రాహుల్ కి దీక్సూచీల మారిందా.?

గత మూడు దఫాలుగా కేంద్రంలో బీజేపీ వరుసపెట్టి అధికారంలోకి వచ్చింది. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ…

9 minutes ago

Lokesh Targets 1,000 Five-Star Schools With Skills

Andhra Pradesh Education Minister Nara Lokesh has set a major target to improve government schools…

16 minutes ago