
దేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒకరకంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించి ప్రత్యర్థి పార్టీల మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది అంటే అందుకు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి గెలుపే ప్రధాన పాత్ర పోషించిందని చెప్పకతప్పదు.
అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏపీలోని ప్రాంతీయపార్టీలు దేశ రాజకీయాలను శాసించే అవకాశం ఉండడంతో, అటు కాంగ్రెస్ కూడా వైసీపీ ని తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనితో భవిష్యత్ రాజకీయాలలో ఏపీలో నూతన రాజకీయ సమీకరణలు జరిగే అవకాశం ఉందంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే జరుగుతుంది.
ఒకవేళ అనుకున్నట్టే రాహుల్ వ్యూహాలు ఫలించి కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమిలోకి వైసీపీ ఎంట్రీ ఇస్తే..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణానికి మరోసారి బ్రేకులు పడ్డట్టేనా.? ఆమె మరోమారు రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోవాల్సిందేనా.? షర్మిలకు అటు ఏపీలో ఇటు తెలంగాణలో రాజకీయంగా మరో ప్రత్యామ్నాయం లేనట్టేనా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటువంటి సందర్భంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, జగన్ కోటరీ బాధితుడిగా వైసీపీ నుంచి బయటకు వచ్చి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో ఏపీ రాజకీయాలలోకి మరోకొత్త పార్టీని ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి షర్మిలకు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా.? కాంగ్రెస్ లో ముగిసిన షర్మిల రాజకీయ ప్రస్థానం సాయిరెడ్డి పీఆర్పీ తో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందా.?
గతంలో సాయిరెడ్డి, షర్మిల ఇద్దరూ కూడా జగన్ ‘వదిలిన బాణాలు’ మాదిరి వైసీపీ గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీల ఓటమి కోసం శ్రమించినవారే కానీ కట్ చేస్తే చివరికి జగన్ ‘బాధితులుగా’ మిగిలిపోయారు. ‘నేటి బాధితులే రేపటి రాజకీయ ప్రత్యర్థులు’ అనే రాజకీయ నానుడిని నిజం చేస్తూ ‘శత్రువుకి శత్రువు మిత్రుడే’ అన్న సామెతను అనుసరిస్తూ సాయి, షర్మిల రాజకీయంగా ఒక్కటవుతారా.?
వైసీపీ నేతల కోసం తన పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయంటూ సాయి చేసిన ప్రకటనలు షర్మిలకు కూడా వర్తిస్తాయా.? కాంగ్రెస్, వైసీపీ రాజకీయంగా దగ్గరైతే సాయి, షర్మిల కూడా వైసీపీ ఓటమి కోసం చేతులు కలుపుతారా.? ఇలా అనేక ప్రశ్నలు ఏపీలో ఏర్పడే కొత్త రాజకీయ సమీకరణాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి..!
రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు తమ అధికారం కోసం, తమ పదవుల కోసం మేనిఫెస్టో పేరుతో ఇష్టానుసారంగా ఉచితపథకాలు…
The Cockroach Janta Party of India had been extremely active in the social arena over…