
ఏపీలో వైసీపీ పార్టీ చంద్రబాబు పై పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించడంలో తలమునకలైన టీడీపీ పార్టీ, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ఎన్నికలలో పోటీచేసే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. బాబు అరెస్టు, ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏపీలో ఈసారి ఎన్నికలు టీడీపీ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారడంతో రెండు పడవల మీద కాలు మోపడం కష్టమనే ఉద్దేశంతో టీడీపీ తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంది.
అయితే అసలు తెలంగాణలో పార్టీ ఉనికినే కోల్పోయిన వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు అస్త్రసన్యాసం చేసాడని, ఆయన, ఆయన పార్టీ అక్కడ ఇక్కడాఎక్కడా నెగ్గేదేలేదని హేళనచేశారు. అయితే ఇప్పుడు రాజన్న బిడ్డ, జగనన్న వదిలిన బాణం కూడా తెలంగాణ ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు మరి దీనికేం బదులిస్తారో వైకాపా నేతలు.తానూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వకూడదనే సదుద్దేశంతోనే, ఈ కేసీఆర్ దొరల కుటుంబ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిపించడానికే ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అయితే తానూ ఎన్నికలలో పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలియచేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే YSRTP కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో అండగా నిలబడాలని కోరారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చరిత్ర తనను క్షమించదని తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నటు చెప్పుకొచ్చారు. గతంలో పొంగులేటి తనతో కలిసి నడిచారని, ఆయన గెలుపుకోసం తానూ ప్రచారం చేయడం కూడా జరిగిందని ఇప్పుడు ఆయన పాలేరులో పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేనెలా ఆయన ఓటమికి కారణం కాగలను, “గెలుపు గొప్పదే కానీ త్యాగం అంతకంటే గొప్పది”. అన్ని అలోచించి మేధావులతో సంప్రదించి కొంచెం కష్టమైనా తప్పక ఈ నిర్ణయం తీసుకున్నాను.ఈ నిర్ణయం మిమ్మల్ని బాధిస్తే అందుకు మీ అందరిని క్షమాపణలు కోరుకుంటున్నా అంటూ తన సామజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు వైస్ షర్మిల.
పోటీ చేయడం చేయకపోవడం అనేది అక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారు.అన్ని సార్లు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గకపోతే నలుగురిలో నవ్వులపాలవడం కాయం.పోటీ చేయకపోతే అస్త్రసన్యాసం అంటూ కించపరచడం మానుకోవాలి. అందరూ కింద పది పైకి లెగిసినవారే అనేది గుర్తుంచుకుని ప్రవర్తించాలి.
గతంలో కాంగ్రెస్ పార్టీ నే మా కుటుంబానికి అన్యాయం చేసిందంటూ ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి తానూ పోటీ నుండి తప్పుకుంటూ మరి తన మద్దతు తెలియచేస్తుంది ఎవ్వరు ఉహించి ఉండరు. కానీ అది జరిగింది అందుకే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరుగవచ్చు అంటారు. ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు.,ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా పర్మినెంట్ కాదు.
Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…