
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్ పై నానాటికి విమర్శల డోసు పెంచుతూ అన్నకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా కడప రాజకీయ వాతావరణాన్ని మార్చుకుంటూ ముందు కెళ్తున్నారు వైస్ షర్మిల. కడపలో అవినాష్ ఓటమితో తన అన్న జగన్మోహన్ రెడ్డి కి తన స్టామినా ఏంటో రుజువు చేయాలనీ ఆరాటపడుతున్న షర్మిల తనకు మద్దతుగా వివేకా భార్య సౌభాగ్యమ్మను కడప ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చారు.
భర్తను కోల్పోయి, ఉన్న ఒక్క కూతురు తన తండ్రి చావుకి న్యాయం కావాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న జగన్ నిందితులను కాపుకాస్తున్నాడు అంటూ తనకు తన బిడ్డకు న్యాయస్థానంలో దొరకని న్యాయం ప్రజా కోర్టులో దొరుకుతుందని ఆశించి మీ ముందుకు వచ్చి అర్దిస్తున్నాను షర్మిలకు ఓటు వేసి గెలిపించడంతో వివేకా చివరి కోరికను తీర్చినవారవుతారు అంటూ కడప ప్రజలను ఓటడుగుతున్నారు సౌభాగ్యమ్మ.
ఆరు పదుల వయస్సు పైబడి ఉండి, ఇంతవరకు ఏనాడూ రాజకీయ వేదికల మీద కనపడని, రాజకీయ ప్రసంగాలు చేయని వ్యక్తి కూడా తన ఎదురుగా ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా ప్రజల ముందు ఎటువంటి తడబాటు, బెదురు లేకుండా తన ఆవేదనను బయటపెట్టి తన ఆడబిడ్డలకు న్యాయం చేయమని కోరుకుంటున్నారు అంటే మనస్సులో ఉన్న ఆవేదనకు, ఆక్రోశాన్ని వ్యక్తపరచడానికి కంటి ముందు ఎటువంటి పేపర్ అక్కరలేదని సౌభాగ్యమ్మ నిరూపించారు.
కానీ జగన్ మాత్రం కనీసం తన ప్రత్యర్థిని తిట్టాలన్నా ఎదర స్క్రిప్ట్ పేపర్ లేకపోతే నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేని పరిస్థితి. కళ్ళ ముందున్న పేపర్ చదువుతుంటేనే జగన్ ప్రసంగాల పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. అటువంటిది ఇలా బహిరంగ సభలలో స్క్రిప్ట్ లేకపోతే ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు అనే పదాలు పలకడం కూడా అసాధ్యమే అన్నట్టు ఉంటుంది జగన్ వ్యవహార శైలి.
కానీ సునీత కానీ, షర్మిల కానీ, సౌభాగ్యమ్మ కానీ తమ ప్రసంగాలతో కడప ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల చివరి అంకంలో ప్రచారంలో అడుగు పెట్టిన వివేకా సతీమణి పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డకు పసుపు కుంకుమ, చీర, సారా ఇచ్చి పంపడం ఇక్కడి ఆనవాయితీ. కానీ షర్మిల తన పుట్టినిళ్లయినా కడప ప్రాంత ప్రజల నుండి అవేమి కోరుకోవడం లేదు. కేవలం తన పోరాటనికి అండగా ఉంటూ న్యాయం మాత్రమే కావాలని ఆశిస్తుంది.
ఆ న్యాయం ఓట్ల రూపంలో వేసి తన కొంగు నింపి ఢిల్లీ పంపాలని సౌభాగ్యమ్మ చివరిలో వచ్చి కడప ప్రజలకు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు. దీనితో ఇన్నాళ్ల తన గాయానికి షర్మిల మందు వేయగలదని భావించిన సౌభాగ్యమ్మ షర్మిలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. గాయం విలువ తెలిసినోడే సాయం చెయగలడు అంటారు అందుకే సుమీ..! మరి సౌభాగ్యమ్మ ఎంట్రీ తో అవినాష్ ఓటమి కి మరో అడుగు తోడయినట్టే అంటున్నారు వివేకా అభిమానులు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…