
అప్పుడు వివేకా కుమార్తె సునీతారెడ్డి జోక్యం చేసుకొని సుప్రీంకోర్టుని ఆశ్రయించి, ఆ కేసు విచారణను హైదరాబాద్‌కు మార్పించి సీబీఐని కాపాడారు. అప్పటి నుంచి కాస్త హుషారుగా హుషారుగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చకచకా పావులు కదిపేసరికి రన్నింగ్ రేసు మద్యలో పరిగెత్తడం మరిచిపోయిన్నట్లు మళ్ళీ దిక్కులు చూస్తూ నిలబడిపోయారు.
మళ్ళీ అప్పుడు కూడా సునీతారెడ్డి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి తిరిగి ఈ కేసు విచారణలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించారు. దాంతో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే ఏదేదో జరిగిపోయింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్ళిన సీబీఐ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తేలా ఉందంటూ హైదరాబాద్ తిరిగివచ్చేశారు.
ముందస్తు బెయిల్ సంపాదించుకోవడంతో అవినాష్ రెడ్డి ప్రతీ శనివారం ధైర్యంగా సీబీఐ ఆఫీసుకు వెళ్ళి వస్తున్నారు. అయినప్పటికీ వారు ఆయనను కాగితాల మీద అరెస్ట్ చేసి కాగితాల మీదనే విడుదల చేశారట! తాము ఆయనను ఏదో ప్రశ్నించామని వారు చెప్పుకొంటారు. ఆయన చిర్నవ్వులు చిందిస్తూ సీబీఐ కార్యాలయం వద్ద వేచి చూస్తున్న తన అనుచరులకు, మీడియాకు టాటా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. వివేకా కేసులో ఏం జరుగుతోందంటే ఇదే జరుగుతోంది.
కనుక సునీతారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు విషయంలో సీబీఐ న్యాయవాదులకు తమ న్యాయవాదులు సహాయపడేందుకు అనుమతి తెచ్చుకొన్నారు. అంటే సీబీఐని సునీతారెడ్డి వేలు పట్టుకొని నడిపించబోతున్నారనుకోవాలేమో?ఈవిదంగా చేయడం వలన సీబీఐ అధికారులు, సునీతారెడ్డితో కుమ్మక్కు అయ్యారనే అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి వాదనలకు బలం చేకూర్చిన్నట్లవుతోంది కదా?
అయినా దేశంలో ఎక్కడైనా ఎటువంటి క్లిష్టమైన కేసులనైనా దర్యాప్తు చేసి దోషులను పట్టుకోగల సత్తా ఉన్న సీబీఐ చేతులను ఎవరు కట్టేస్తున్నారు? సీబీఐకి సునీతారెడ్డి న్యాయ సహాయం చేయడం సీబీఐ చరిత్రలో ఓ కొత్త అధ్యాయంగా వ్రాసుకోవాలేమో?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…