Telugu

విజయమ్మను బయటకు సాగనంపడం ఖాయమేనా?

శుక్రవారం నుంచి మంగళగిరిలో రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీ కనుక వైసీపీ మంత్రులు, నేతలు అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రత్యక్షమైంది. అదే… వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ చేత ఆ పదవికి రాజీనామా చేయించి పార్టీ నుంచి బయటకు సాగనంపబోతున్నారని!

ఇప్పటికే చెల్లి వైఎస్ షర్మిలను దూరం పెట్టడంతో ఆమె తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకొన్నారు. ఇప్పుడు తల్లిని కూడా వైసీపీలో నుంచి జగన్ బయటకు సాగనంపబోతున్నారని ఆ వార్తల సారాంశం.

ADVERTISEMENT

ఏవిదంగా అంటే ఆమె వైఎస్ షర్మిల పార్టీకి కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు కనుక ఏపీలో వైసీపీకి ఆమె గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించడం సరికాదు. కనుక ఆమె చేత రాజీనామా చేయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతీ రెండేళ్ళకు ఓ సారి వైసీపీ అధ్యక్షుడుని ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు కూడా స్వస్తి పలకబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. వైసీపీకి జగన్మోహన్ రెడ్డి శాస్విత అధ్యక్షుడిగా రేపటి నుంచి జరిగే ప్లీనరీలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.

దీని కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులతో మాట్లాడారని, వారు పార్టీ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసుకొంటే సరిపోతుందని చెప్పినట్లు తెలుస్తోంది. నిప్పు లేనిదే పొగరాదు కనుక ఈ వార్తలలో నిజానిజాలు రేపు మొదలయ్యే వైసీపీ ప్లీనరీ సమావేశంలో తేలిపోతాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Re-Release $13.5: Why US Tickets So Expensive?

Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…

2 hours ago

Karthik Subbaraj’s Dorothy: Will Netflix Release Spark Fresh Controversy?

Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…

3 hours ago