
ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా… తన కుటుంబంలో ఏం జరిగినా… అన్నింటికీ కారణం ‘చంద్రబాబే’ అంటూ గత అయిదేళ్లుగా చెప్పిందే చెప్తోన్న జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలేలా మరో వీడియో ప్రత్యక్షం అయ్యింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, జగన్ మోహన్ రెడ్డి తల్లి అయిన విజయమ్మ ఈ ఎన్నికలకు దూరంగా అమెరికాకు వెళ్లిపోయిన వైనం తెలిసిందే. ఈ ప్రయాణం వెనుక అనేకానేక అభిప్రాయాలు వెలువడగా, ఎన్నికల ప్రచారం ముగియపోనున్న చివరి రోజున జగన్ కు దిమ్మతిరిగే విధంగా ఓ వీడియో బైట్ ను విడుదల చేసారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరిని న్యాయానికి, ధర్మానికి తోడుగా ఉండమని కోరిన విజయమ్మ, కడప ఎంపీగా పోటీ చేయబోతున్న తన తనయురాలు షర్మిలను విజయతీరాలకు తీర్చమని కోరింది. ఇదే కడప ఎంపీగా షర్మిలకు ప్రత్యర్థిగా అవినాష్ రెడ్డిని జగన్ బరిలోకి దింపిన విషయం తెలిసిందే.
‘రాజు గారి మొదటి భార్య మంచిది’ అన్న సామెత ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే, విజయమ్మ ఏ విధమైన దిశానిర్ధేశం చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వీడియోలో గమనించదగ్గ మరో విశేషం ఏమిటంటే…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చిన విజయమ్మ, కొడుకు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన గానీ, జగన్ అనే ఒక్క పదం కూడా ఎత్తలేదు. గత ఎన్నికలలో ఇంటింటికి తిరిగి జగన్ తరపున ప్రచారం నిర్వహించిన విజయమ్మ, నేడు కనీసం పేరు కూడా ప్రస్తావన తీయకపోవడం పరిశీలించదగ్గ అంశం.
అయితే ఈ వీడియో బైట్ కు కారణం కూడా చంద్రబాబేనని జగన్ చెప్పుకొస్తారేమో? అంటూ సోషల్ మీడియాలో పడుతున్న సైటైర్లు, కౌంటర్లకు కొదవలేదు. ఇటీవల షర్మిల కూడా ఇదే అంశంలో కాస్త ఎటకారాన్ని జోడిస్తూ ‘అద్దంలో మీకు మీరు కనపడుతున్నారా? చంద్రబాబు కనపడుతున్నారా?’ అని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.
దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ…
YouTuber Dhruv Rathee has alleged that he was taken from his home on October 10…