వివేకా హత్య కేసు కూడా ఇప్పుడేనా… బాబోయ్!

గత ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేయబడిన తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ కళ్ళారా చూశారు. అప్పటి నుంచి ఈ కేసులో చోటు చేసుకొంటున్న చిత్రవిచిత్రమైన మలుపులను కూడా ప్రజలందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.

చివరికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని 2023, జూలై 30వ తేదీ డెడ్‌లైన్ పెట్టినా, మళ్ళీ సుప్రీంకోర్టు చేత వాయిదాలు ఇప్పించుకొంటున్న గొప్ప కేసు ఇది! దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాకి సరిపడే గొడ్డళ్ళు, కత్తులు, రక్తపాతం, క్రైమ్ సీన్, క్రిమినల్స్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, కేసులు, ఇంకా ఊహకందని అనేక ట్విస్టులు దీనిలో ఉన్నా ఆయన ఎందుకో ఈ కేసువైపు కన్నెత్తి కూడా చూడలేదు!

ADVERTISEMENT

ఈ కేసుల గురించి అందరికీ తెలిసిందే కనుక మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొనే అంత పుణ్యకాలం లేదు. కనుక తాజా అప్‌డేట్ ఒక్కటే చెప్పుకొంటే సరిపోతుంది.

ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరిగా సీబీఐ పేర్కొంటున్న శివశంకర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అది తేల్చక మునుపే వివేకా కుమార్తె సునీతారెడ్డి తాను కూడా ఈ కేసులో జాయిన్ (ఇంప్లీడ్) అయ్యేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇందుకు తమకేమీ అభ్యంతరం లేదని ఈ కేసును నాలుగేళ్ళుగా విచారిస్తున్న సీబీఐ కోర్టుకి తెలియజేసింది.

దీంతో వివేకా హత్యలో శివశంకర్ రెడ్డి పాత్ర గురించి ఆమె కూడా తన వాదనలు వినిపించబోతున్నారు. ఈ కేసు (బెయిల్‌ పిటిషన్‌) తదుపరి విచారణ డిసెంబర్‌ 29కి వాయిదా పడింది. అంటే ఏపీ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగబోతోందన్న మాట!

గత ఎన్నికలలో వివేకా హత్యతో కడప జిల్లా ప్రజలలో ఏర్పడిన సానుభూతితో వైసీపి చాలా లాభపడింది. కానీ అదే కేసుని సాగదీసుకొంటూ మళ్ళీ ఎన్నికల వరకు తెచ్చుకోవడంతో ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు తీర్పు ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చినా అది టిడిపి, జనసేనలకు అస్త్రాలుగా మారుతాయని వేరే చెప్పక్కరలేదు. కనుక వివేకా హత్య కేసుని వైసీపి చాలా తెలివిగా హ్యాండిల్ చేశామనుకొంటుంటే, అదే భూతంగా మారి వైసీపిని వెంటాడుతుండటం ఆశ్చర్యమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Team India’s X-Factor Out Again? Comeback Delayed!

Hardik Pandya’s return to the Indian team could be delayed again after the all rounder…

11 minutes ago

Hyderabad’s 1.32 Lakh Stadium: Criminal Waste of Money?

Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…

41 minutes ago