
తమ వివాహం వివేకా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదని, వివేకా గన్‌మెన్ ఎన్.శివప్రకాశ్ రెడ్డి, సునీతా రెడ్డి తనను తరచూ ఫోన్‌లో బెదిరించేవారని షమీమ్ తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు. వివేకాతో వివాహం అయిన తర్వాత ఆయన తన సోదరుడు బాషా సాహబ్ భాయ్‌జాన్ను తన పీఏగా నియమించుకొన్నారని ఆమె పేర్కొన్నారు.
తన సోదరుడు వివేకా వెన్నంటి ఉంటూ ఆయన ఆహారం, ఆరోగ్యం గురించి చూసుకొంటూ చేదోడు వాదోడుగా ఉండేవాడని తెలిపారు. దీంతో వివేకా తన సోదరుడికి ఉండేందుకు ఇల్లు కూడా ఇచ్చారని షమీమ్ తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టింది.
ఒకవేళ సునీతారెడ్డి తనను బెదిరించి ఉంటే, వివేకా హత్య తర్వాత ఇంతకాలం (నాలుగేళ్ళు) ఆమె ఈ విషయం సీబీఐకి చెప్పలేదా లేదా చెప్పినా సీబీఐ పట్టించుకోలేదా?నేడో రేపో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయబోతుంటే ఇప్పుడే ఈ విషయం బయటకు లీక్ చేయడానికి కారణం ఏమిటి?అనే సందేహాలకు బహుశః త్వరలోనే వైసీపీ ద్వారా జవాబులు లభిస్తాయేమో?
Ranabaali has been facing criticism over its background score since its release. Starring Vijay Deverakonda…
స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్ధులకే పరిమితం అనుకునే రోజులు కావివి. ఈ చెత్త…