అమరావతికి తప్పని వైసీపీ ముప్పు..!

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఏపీకి రాజధాని లేదనే బాధ లేదు, రాజధాని పనులు పునః ప్రారంభించి పదిరోజులైనా కాకముందే రాజధాని పై విషం చిమ్ముతున్నామే అన్న ఆలోచన లేదు, మళ్ళీ అవే తప్పుడు కథనాలు, అవే అసత్యపు ప్రచారాలు.

అమరావతి మునిగిపోయింది, రాజధాని ఒక ముంపు ప్రాంతం, చెరువులను తలపిస్తున్న నిర్మాణాలు, ఇదేనా ఆంధ్రుల కలల రాజధాని….ఇలా వైసీపీ సోషల్ మీడియా అమరావతి పై మరోసారి తన విషాన్ని జల్లుతుంది. నిన్న ఏపీ అంతటా కురిసిన వర్షాలతో రాష్ట్రం తడిచి ముద్దయ్యింది.

ADVERTISEMENT

వర్షం తో పాటుగా వచ్చిన భీకర గాలులకు చేతికొచ్చిన పంట నేలపాలైయి వేలాది ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. ఈ అకాల వర్షాలు రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వాన్ని తట్టి లేపి బాధితులకు అండగా నిలవాల్సిన విపక్ష వైసీపీ రాజధాని పై అసత్య ప్రచారాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇన్నాళ్ళుగా శవ రాజకీయాలతో ప్రసిద్ధి చెందిన వైసీపీ ఇప్పుడు రాజధాని విధ్వంసకర రాజకీయాలలో ఆరి తేరిపోయింది. నిన్న కురిసిన వర్షాలకు గాను అమరావతిలో నిర్మించబోతున్న శాశ్వత భవనాల కోసం తీసిన పునాదులలో నీరు చేరింది. అయితే భవనాల నిర్మాణాల కోసం పునాదులు తీసినప్పుడు ఆ పునాదుల లోతులో వర్షం వస్తే నీరే చేరుతుంది.

అది ఒక్క అమరావతిలోని కాదు జగన్ నివాసముంటున్న తాడేపల్లి ప్యాలస్ పక్కన కూడా నిర్మాణాల కోసం పునాదులు తీస్తే ఇదే మాదిరి వర్షం వస్తే ఆ పునాదులలో కూడా నీరు చేరుతుంది. అంత మాత్రాన తాడేపల్లి వరద బాధిత ప్రాంతంగా పేర్కొనబడుతుందా.? లేక జగన్ ప్యాలస్ వరద ప్రాంతంలో నిర్మించినట్టవుతుందా.?

ఒక్కసారి నిర్మాణాలు పూర్తయితే ఆ పునాదుల గోతులు, వాటి కోసం ఏర్పాటు చేసిన గుంటలు కనిపిస్తాయా.? అప్పుడు వర్షాలు వస్తే అమరావతి నిర్మాణాలలో వరద నీరు చేరుతుందా.? వంటి కనీస ఆవహగాన కూడా లేకుండా రాజధాని నిర్మాణాల పై ఎలా అయినా తప్పుడు ప్రచారాలు చెయ్యాలనే ఉద్దేశంతో వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాలు ఆ పార్టీ పునాదులను కదిపినా ఇంకా వారికి తత్త్వం బోధపడడం లేదు.

అలాగే టీడీపీ కూడా అమరావతి పై వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని సరిగ్గా అడ్డుకోలేక సతమతమవుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదుల పై ఎన్ని కేసులు మోపినా, ఎంతమందిని జైళ్లకు పంపినా దేశం సరిహద్దుల వెంబటి పొంచి ఉన్న ఉగ్రవాదుల మాదిరి రాజధాని పై తీవ్రవాద తరహాలో వైసీపీ దాడి చేస్తూనే ఉంది.

కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వైసీపీ దుస్సాహసాలకు అడ్డుకట్ట వేయలేకపోతే 2019 మాదిరే టీడీపీ, జనసేన పార్టీలు తగిన మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. చిన్నపాటి వర్షానికే ప్రజా రాజధాని నీటమునిగింది, ఇక రాష్ట్రంలో వరదలొస్తే రాజధాని నిర్మాణాలు వరద ముంపు బారిన పడిపోతాయి, వేల కోట్ల ప్రజాదనం వరదల పాలవుతుంది,

రాష్ట్ర ఖజానా మొత్తం ఒక్క అమరావతి నిర్మాణాలతోనే ఖాళీ అవుతుంది అంటూ వైసీపీ చేస్తున్న అద్దు అదుపులేని ప్రచారాలు రాజధాని రైతులలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గతంలో మాదిరి మరో రాష్ట్రంలో మారు వైసీపీ అధికారంలోకి వస్తే, తమ సంగతేంటి అనే ఆందోళన అమరావతి రైతుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇలా అయితే ప్రభుత్వం కోరుకుంటున్నట్టు అమరావతి ప్రాంతంలో మరికొన్ని ఎకరాల భూసేకరణ సాధ్యమవుతుందా.? ప్రభుత్వాలను నమ్మి రైతులు భూములిచ్చే పరిస్థితి ఉంటుందా.? ఇలా జరిగితే అంతిమంగా విజయం సాధించేది ఎవరు.? దీనివల్ల ఎవరి పంతం నెగ్గినట్టవుతుంది.?

రాష్ట్రంలో అశాంతి, అల్లర్లు సృష్టించి అలజడి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే వైసీపీ అసత్యపు ప్రచారాల వెనుక దాగి ఉన్న ఆంతర్యం కావచ్చు. వాటికీ చెక్ పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత రెండు కూడా కూటమి పార్టీలకున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

8 minutes ago

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

38 minutes ago