
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్ కుటుంబం అనేక మార్పులను తీసుకొచ్చింది. అయితే వాటిలో కొన్ని మార్పులు ఆంధ్రప్రదేశ్ కు మేలు చేస్తే చాలావరకు ఏపీని రాజకీయంగా, ఆర్థికంగా కోలుకొని దెబ్బ తీశాయి, ఇప్పటికి తీస్తున్నాయి కూడా .
వాటిలో కొన్ని ముఖ్యంగా వైసీపీ తో ఏపీ రాజకీయాలలో దూసుకొచ్చిన వైస్ జగన్ రాష్ట్రంలో కుల రాజకీయాలను పెంచి పోషించారు. వైసీపీ రాకతో ఏపీలో కుల రాజకీయాలు కోరలు చాచాయి. ఒక పక్క తన సామజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కించడం తో పాటుగా,
మరోపక్క ఇతర సామజిక వర్గాలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ, కులాల మధ్య రాజకీయ కుంపటి రాజేసీ ఆ మంటలో వైసీపీ చలి కాచుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వైస్ జగన్ నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేందుకు కమ్మ సామజిక వర్గం పై నేరుగా విషం చిమ్మారు. అలాగే ఆ సామజిక వర్గం పై రాజకీయంగా కక్ష్య సాధించారు.
అందులో భాగంగానే రాష్ట్ర రాజధాని అమరావతి పై ‘కమ్మ’రావతి అంటూ కుల ముద్ర వేస్తూ అమరావతిని సమాధి చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బకొట్టారు, అలాగే రాజధాని లేని రాష్ట్రంగా మార్చి ఏపీని నైతికంగా కుంగతీసారు.
ఇక ఇటు జనసేన అధినేత పవన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు గాను ముద్రగడ వంటి సీనియర్ కుల నాయకుడిని రంగంలోకి దింపి కాపు సామజిక వర్గాన్ని రెచ్చకొట్టారు. అలాగే వంగవీటి రంగ హత్యను ప్రస్తావిస్తూ టీడీపీ – జనసేనల మధ్య రాజకీయ వైరం సృష్టించి తద్వారా కమ్మ – కాపు సామజిక వర్గాల మధ్య విద్వేషానికి భీజాలు వేశారు.
అలాగే అక్కడ కొడాలి నాని తో బాబు ని బూతులు తిట్టుస్తూ కమ్మ సామాజిక వర్గాన్ని మానసిక క్షోభకు గురి చేసారు. అలాగే ఇక్కడ ముద్రగడ, పేర్ని నాని, అంబటి వంటి వారిని పవన్ మీదకు ఉసికొల్పి కాపు సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసారు.
ఇలా అన్న వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ‘కులం’ చుట్టి తిరిగేలా చేస్తే ఇక చెల్లి వైస్ షర్మిల ఏపీ రాజకీయాలను ‘మతం’ వైపుకి నడిపించేందుకు సిద్ధమయ్యారు. దళిత వాడలలో 5000 గుడుల నిర్మాణానికి టీటీడీ సిద్దమయ్యిందని, ఇది సెక్యులరిజం కి వ్యతిరేకమంటూ మీడియా ముందు కొచ్చారు షర్మిల.
ఇలా టీటీడీ తన ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల గుడులు కట్టించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పుడు టీటీడీ కి కూటమి ప్రభుత్వానికి అంత అవసరం ఏమొచ్చిందని, టీటీడీ దగ్గర నిధులు ఎక్కువగా ఉంటే ఇలా గుడుల నిర్మాణాలు కాకుండా ప్రజల అవసరాలు తీర్చాలంటూ సెక్యులరిజం ముసుగులో షర్మిల ఏపీలో మత రాజకీయాలకు తెరలేపుతున్నారు.
ఇలా ఒకపక్క అన్న వైస్ జగన్ కుల రాజకీయాను ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాజకీయానికి కుల కట్టుబాట్లు సృష్టిస్తే చెల్లి షర్మిల సెక్యులరిజం పేరుతో మత రాజకీయాలకు నాంది పలుకుతూ మతం విద్వేషాలు రెచ్చకొట్టేలా ముందుకెళ్తున్నారు. ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బ తీసే అంశాలే.
Ranabaali marks the second collaboration between director Rahul Sankrityan and Vijay Deverakonda. Set against a…
It has been more than a couple of years since the formation of the NDA…