
విగ్రహాలు తయారుచేసేందుకు మూస (టెంప్లెట్) వాడుతుంటారు. వాటితో తయారుచేసే విగ్రహాలన్నీ చిన్న తేడా కూడా లేకుండా అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటాయి. కాకపోతే వాటికి వేర్వేరు రంగులు వేసి అమ్ముతుంటారు.
ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా అచ్చు గుద్దిన్నట్లు ఒకేలా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీలే ఒకేలా ఉండవు. ఒకేలా వ్యవహరించవు. కానీ ఈ రెండు పార్టీల మద్య చాలా స్వారూప్యాతలు కనిపిస్తాయి.
ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ ఇద్దరూ ప్యాలస్, ఫామ్‌హౌసు నుంచి బయటకు రాకుండా అక్కడి నుంచే పార్టీలను నడిపిస్తున్నారు. అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు.
ఇద్దరూ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. గుమ్మం దాటి అడుగు బయట పెట్టకపోయినా ఇద్దరూ వచ్చే ఎన్నికలో మేమే గెలిచి అధికారంలోకి వస్తామని నమ్మకం చెప్పుకుంటారు.
రెండు పార్టీలు ఎన్డీయేలో భాగస్వాములు కానప్పటికీ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలు చెప్పరు. ఒకప్పుడు ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ కత్తులు దూసిన కేసీఆర్, ప్రత్యేక హోదా వంటి కొన్ని అంశాలపై సున్నితంగా విమర్శించిన జగన్ ఇద్దరూ కూడా ఇప్పుడు ప్రధాని మోడీని పల్లెత్తు మాటనరు.
ఇక్కడ జగన్‌కి షర్మిల, అక్కడ కేటీఆర్‌కి కవిత పక్కలో బల్లెంలా తయారయ్యారు. వారిపై నేరుగా విరుచుకు పడటం లేదు కానీ వారి కాలకేయ సైన్యం తమని వేధిస్తూనే ఉన్నాయని ఇద్దరు చెల్లెమ్మలు పిర్యాదు చేస్తూనే ఉన్నారు.
జగన్, కేటీఆర్ ఇద్దరూ కూడా వచ్చే ఏడాది తర్వాత పాదయాత్రలకు బయలుదేరుతామని చెప్పుకుంటున్నారు.
ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే, జగన్ పర్యటనలలో చిన్నపిల్లలను ఎత్తుకొని ముద్దాడటం తప్పనిసరి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిని ఫాలో అవుతున్నట్లుంది.
నిన్న కేసీఆర్ బస్సులో సభకు వెళుతున్నప్పుడు దారిలో ఓ అభిమాని కూతురిని భుజంపై కూర్చోబెట్టుకొని రోడ్డు పక్కన నిలబడి చేతులు ఊపితే, కేసీఆర్ బస్సు ఆపించి ఆమె చేతిలో ఉన్న తన ఫోటో ఫ్రేం తీసుకున్నారు.
భద్రతా కారణాల వలన పాపని బస్సులోకి అనుమతించలేదు. కనుక కేసీఆర్ ఆ పాపకు ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ముందుకు సాగారు.
రెండు రాష్ట్రాలలో రెండు పార్టీలలో అచ్చు గుద్దినట్లు ఇంత స్వారూప్యత ఉండటం చాలా ఆశ్చర్యకరమే కదా?
Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…
Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…