Telugu

శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా టీచర్ల పై దాడికి వైసీపీ కుట్ర.?

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోట నియామకాల పై వివాదం మరింత ముదురుతోంది. క్రీడా ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుండగా, ఆ ఆరోపణలను స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు, అధికారులు ఖండిస్తున్నారు.

సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది యువత తమ క్రీడా ప్రతిభతో సత్తా చాటుకుని స్పోర్ట్స్ కోటా నిబంధనల మేరకు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించామంటూ ఉద్యోగులు వైసీపీ కి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఒకపక్క ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సంబంధిత అధికారులు నియామకాలలో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు లేవంటు ఆధారాలు చూపిస్తున్నా వైసీపీ మాత్రం తగ్గేదెలా అంటూ విషయాన్ని తెగేదాకా లాగుతున్నట్టు కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఇప్పటి వరకు ఈ వివాదం మంత్రి లోకేష్ vs వైసీపీ అన్నట్టుగా సాగినప్పటికీ నేడు విజయవాడలోని శాప్ ముట్టడి అంటూ వైసీపీ ఇచ్చిన పిలుపు, అక్కడ జరిగిన ఊహించని పరిణామాలతో ఈ అంశం ఉపాధ్యాయ ఉద్యోగులు vs వైసీపీ గా రూపం మార్చుకుంది.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు నిరసనగా వైసీపీ విజయవాడ శాప్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చి, అక్కడ మంత్రి లోకేష్ కి వ్యతిరేకంగా, డీఎస్సీ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన ఉద్యోగుల టార్గెట్ గా నినాదాలు మొదలుపెట్టింది. దీనితో వైసీపీ శ్రేణుల ఆరోపణలు ఖండించేందుకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు సైతం శాప్ కార్యాలయానికి చేరుకున్నారు.

దీనితో ఇరువర్గాల పోటాపోటీ నిరసనలతో శాప్ కార్యలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమకు వ్యతిరేకంగా నిరసన కు వచ్చిన ఉద్యోగుల పై వాటర్ బాటిల్స్ వేస్తూ వైసీపీ వారిని రెచ్చకొట్టే ప్రయత్నం చేసినట్టు ఆరోపిస్తున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్రమైన తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వైసీపీ నేతలు తమ పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకూండా తమ పై బాటిల్స్ విసురుతూ తమ పై దాడికి కుట్ర చేసారంటూ ఉద్యోగులు వాపోతున్నారు. వైసీపీ నేతలు పదేపదే తమ పై చేస్తున్న ఆరోపణలతో తాము మానసికంగా కృంగిపోతున్నామని, ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగాలను ఇలా అక్రమాలు అంటూ వైసీపీ విమర్శలు చేస్తుంటే అవి తమను తీవ్రంగా బాధిస్తున్నాయంటూ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, ఇకనైనా వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకొని తమ పై నిందలు వేయాలంటూ వైసీపీ ఆరోపణలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఉపాధ్యాయ ఉద్యోగులు. మొత్తానికి వైసీపీ చేపట్టిన శాప్ ముట్టడి, నిరశన కార్యక్రమం కాస్త అదుపు తప్పి బాటిల్స్ విసురుకునే వరకు వెళ్ళింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరసనలు ఎప్పటికి ప్రజాఆమోదం పొందలేవని వైసీపీ ఇప్పటికైనా గ్రహిస్తే మేలేమో…!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

The Paradise Ticket Hike Raises a Question for Andhra Pradesh

Telangana's latest approval for Nani's The Paradise has brought an interesting question into focus. Along…

33 minutes ago

RX 100 Star Kartikeya Turns Director with COMEBACK

Known for maintaining a rigorous physique, actor Kartikeya Gummakonda has revealed his next project, a…

52 minutes ago