Telugu

వైలెన్స్ సినిమాలు ఒకే…బట్ రాజకీయాలు.?

సినిమాలలో ఈ మధ్య వైలెన్స్ ట్రెండ్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. సినిమాలో బ్లడ్ బాట్ ఎంత ఎక్కువగా ఉంటే ఇక ఆ సినిమా అంత మాస్ హిట్టే అనే స్థాయికి ఈ వైలెన్స్ విస్తరించింది. అందుకు హిట్ – 3, పుష్ప, ఓజి, యానిమల్, కెజిఫ్, సలార్ చిత్రాలు మంచి ఉదాహరణలుగా నిలిచాయి.

ఈ చిత్రాలలో వైలెన్స్ ఎక్కువగా ఉండడం, హీరో తన చేతులను రక్తంతో నింపేయడం వంటి సీన్లు ఆయా హీరోల అభిమానులను ఉర్రుతలూగించాయి. అందుకు తగ్గట్టే సదరు మూవీస్ అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయాయ్యి.

ADVERTISEMENT

అయితే ఇటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ తో 18 ఏళ్ళు వయసు పైబడినవారే ఈ చిత్రాన్ని చూసేందుకు అర్హులు అని కొన్ని ఆంక్షలు, పరిమితులు విధిస్తుంది. ఇలా కేవలం వినోదం కోసం ఎంచుకునే రంగంలోనే వైలెన్స్ కు ఇన్ని పరిమితులు, ఆంక్షలు ఉంటే మరి రాజకీయంలో, అందునా అధికారం కోరుకుంటున్న పార్టీ ఈ వైలెన్స్ ని ప్రోత్సహిస్తే.?

ఈ బ్లడ్ బాత్ సినిమాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు కదా అని అదే ట్రెండ్ ని రాజకీయాలలోకి కూడా తీసుకొద్దాం అనుకుంటే అందుకు ఓటర్లు ఒప్పుకుంటారా.? సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే, కానీ రాజకీయాలు వినోదం కోసం కాదు, వికాసం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, తద్వారా ప్రజల భవిష్యత్ పురోగతి కోసం, ప్రజల భద్రత కోసం.

మరి అటువంటి రాజకీయ రంగాలలోకి వైలెన్స్ తీసుకొచ్చి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆశపడుతున్న వైసీపీ రాజకీయాన్ని ఏమనాలి.? దానికి ఏ పేరు పెట్టాలి.? వైసీపీ వై నాట్ 175 అంటూ 2024 ఎన్నికలకు వెళ్తే అందుకు ఓటర్ల నుంచి వైసీపీ కి 11 తో రిటర్న్ గిఫ్ట్ లభించింది.

ఇక ఇప్పుడు వైసీపీ 2.0 కోసం, జగన్ 2.0 ప్రభుత్వం కోసం వైసీపీ రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహిస్తూ, పర్యటనల పేరుతో రప్ప రప్ప రాజకీయాలను అమలు చేస్తూ రాజకీయ కక్ష్య సాధింపుల కోసం మరో ఛాన్స్ అడుగుతుంది. ఇందుకోసం వైసీపీ క్యాడర్ జగన్ ఫ్లెక్సీలకు రక్త తిలకాలు దిద్దుతూ గొడ్డళ్లు, వేటకొడవళ్లతో రోడ్ల మీద వీరంగం సృష్టిస్తున్నారు.

అయితే ఈ తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కి హానికరం వద్దు వద్దు అంటూ ప్రభుత్వం ఎంతలా వైసీపీ శ్రేణులను వారిస్తున్నా వారంతలా రెచ్చిపోతున్నారు, ప్రభుత్వాన్ని రెచ్చకొడుతున్నారు, అలాగే ప్రజలను భయపెడుతున్నారు.

ఇక ఇప్పుడు రప్ప రప్ప 2.0 నినాదంతో వైసీపీ క్యాడర్ ముందుకొచ్చింది. వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నెల్లూరులో ఒక వివాహ వేడుకకు హాజరు కాగా ఆయనను చూసేందుకు అక్కడికొచ్చిన వైసీపీ క్యాడర్ అత్యుత్సాహంతో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో “రక్త హోలీ” ఆడుకుంటాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

ఈ ఒక్క నినాదం వైసీపీ యొక్క రాజకీయ విధానాన్ని స్పష్టం చేస్తుంది. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేదానికి రప్ప రప్ప నినాదాలు, రక్త హోలీ కేకలే చక్కటి ఉదాహరణలు. అయితే వైసీపీ చేసే రక్త హోలీ కోసం ఏపీ ఓటర్లు వైసీపీ వైపు నిలబడాలా.?

ఇటువంటి నినాదాలు వైసీపీ ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లగలవా.? ప్రశాంత రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రెస్ మాదిరి ఉండే ఏపీ రాజకీయాలు ఇప్పుడు వైసీపీ రాకతో రక్త హోలీ నినాదాలతో హోరెత్తుతోంది. ఇటువంటి నినాదాలు పార్టీని ప్రజలకు మరింత దూరం చేస్తుండే తప్ప ప్రజలకు చేరువ కాలేదు.

ఇనన్లు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధాని అమరావతి పరిస్థితి ఏమిటి.? రాష్ట్రానికి తరలి వస్తున్న పరిశ్రమల సంగతేంటి.? కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తల భవిష్యత్ ఏంటి అనే సందేహాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ రక్త హోలీ నినాదాలతో అసలు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే అన్న ఆలోచనే ప్రజలను భయందోళనలోకి నెట్టేస్తుంది.

స్టార్ హీరోలు కేవలం తమ అభిమానుల కోసమే సినిమాలు తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వాటి ఫలితాలు ఎలా ఉంటాయో వైసీపీ కూడా కేవలం అధినేత మెప్పుకోసమో, లేదా పార్టీ క్యాడర్ సంతృప్తి కోసమో ఇటువంటి నినాదాలు చేస్తే ఎన్నికల పోలింగ్ బాక్స్ లోకూడా వైసీపీ కి అటువంటి ఫలితాలే అందుతాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Canada Visa Fraud: ₹38 Lakhs Stolen By J&K Consultant

The Jammu Crime Branch has uncovered a huge visa scam. Local abroad education consultant Lalit…

15 minutes ago

సీజేపీ…రాహుల్ కి దీక్సూచీల మారిందా.?

గత మూడు దఫాలుగా కేంద్రంలో బీజేపీ వరుసపెట్టి అధికారంలోకి వచ్చింది. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ…

48 minutes ago