
వైసీపీ నేతల అరాచకాలనే కాదు ఆపార్టీ శ్రేణుల పడే కష్టాలను కూడా సోషల్ మీడియా మన కళ్ల ముందుంచుతుంది. అధికార పార్టీ శ్రేణుల కష్ఠాలు ఏమిటా అంటారా ఇదుగో ఈ ఫోటోను చూస్తే మీరు కూడా అయ్యో పాపం అంటారు మరి.
సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ పార్టీ నేతలను, మంత్రులను, ఇంచార్జ్ లను బస్సు లో పెట్టి ప్రజలలోకి వదిలారు వైస్ జగన్. నేను బటన్ మాత్రం నొక్కుతాను మీరు బస్సులో రాష్ట్ర యాత్ర చేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి అంటూ ఆదేశాలిచ్చి మరి బస్సులను అందించారు ముఖ్యమంత్రి జగన్.
అయితే అధినాయకత్వం ఆదేశాలను శిరసావహించే నేతలు క్షేత్ర స్థాయిలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తెగ ఊగిసలాడుతున్నారు. బస్సులో ఉగిసలాటలు అంటే ఏంటో ఇంతకాలం ఏపీ ప్రజలకు మాత్రమే తెలిసింది ఇప్పుడు అధికార పార్టీ నేతలకు ఆ ”ఉయ్యాలా జంపాల” ఆట ఆడే అవకాశం వచ్చిందంటున్నారు స్థానిక ప్రజలు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ రోడ్ల దుస్థితి పై ప్రతిపక్ష పార్టీలే కాదు పక్క రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా సెటైర్లు వేశారు అంటేనే పరిస్థితి ఎంత గోరంగా ఉందో ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు వైకాపా నేతలు. సామాజిక సాధికార యాత్రతో బస్సులో బయలుదేరిన వైసీపీ నేతలకు ఇక రోజు గుంతలతో సావాసం అన్న చందంగా మారిపోయింది పరిస్థితి.
రాష్ట్రంలో అస్తవ్యస్తమైన రోడ్ల దుస్థితిలో నానాకష్టాలు పడుతున్న వాహనదారుల వ్యధలు పట్టించుకోని ఈ ప్రభుత్వం ప్రజలను తిరిగి ఓటు ఎలా అడగగలదు అంటూ విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే గుంతల రూపంలో దర్శనమిస్తుంటే జగనన్న ‘వన్స్ మోర్’ అంటూ మీ నినాదాలేంటి అంటున్నారు ప్రతిపక్షాలు.
ఇలా గుంతలతో సావాసం చేస్తూ చచ్చి చెడో యాత్రను ముందుకు తీసుకెళ్దాం అనుకున్న నాయకులకు కొన్ని ప్రాంతాలలో బస్సులు సహకరించడం లేదు. ముందుకెళ్లడానికి బస్సులు మొండికేయడంతో ఆపనిని కార్యకర్తలకు అప్పగించి ముఖ్య నేతలు మెల్లిగా జారుకున్నారు.ఇక చేసేదేమి లేక ఆ బస్సుతో వైసీపీ కార్యకర్తలు పడుతున్న పాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఆగిపోయిన బస్సుతో కుస్తీలు పట్టుకుంటూ మాకేంటంటా? అంటూ నిట్టూరుస్తున్నారు వైకాపా శ్రేణులు.ఇప్పుడు ఆగింది బస్సు మాత్రమే 2024 ఎన్నికలలో ఆగేది ఫ్యానే అంటు సామజిక మాధ్యమాలలో టీడీపీ, జనసేన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అందుకే అంటారు ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారని.ఇది సామెత మాత్రమే అండి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…