Telugu

ఆంధ్రప్రదేశ్: నమ్మలేం దొర..!

వైసీపీ చేసిన తప్పు దిద్దుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో తప్పు చెయ్యాలా.? అనేలా అమరావతి పై వైసీపీ మరోసారి మాట మార్చింది మడం తిప్పింది.

రాష్ట్ర రాజధాని అమరావతి పై మారిన వైసీపీ వైఖరిని వివరించిన సజ్జల వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే విజయవాడ – గుంటూరు మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తాం అంటూ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు.

ADVERTISEMENT

అయితే గత ఐదేళ్ల వైసీపీ అధికారంతో అమరావతిని మూడు రాజధానుల పేరుతో సమాధి చేసిన నేతలు ఇప్పుడు అమరావతి పట్ల తమ వైఖరిని ప్రజలను తిప్పికొట్టారని గ్రహించి తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని తరలింపు ఉందంటూ ప్రకటించారు.

అయితే ఇప్పటికే వైసీపీ అమరావతి విషయంలో రాజకీయ హద్దులన్నిటిని దాటేసింది. తన అహం చల్లార్చుకోవడం కోసం ఏకంగా రాష్ట్ర భవిష్యత్ ను సైతం పణంగా పెట్టి రాజధాని పై వరద, బురద వేసి రాజకీయం చేయడం నుంచి అక్కడి ప్రాంత మహిళలను అవమానిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేసే వరకు,

అలాగే అమరావతి భూములు నిర్మాణాలకు అనువైనవి కాదు అంటూ అసత్య ప్రచారాలు మొదలు అమరావతి కమ్మరావతి అంటూ చేసిన కుల రాజకీయాల వరకు అన్ని ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మార్చేసింది.

దానికి తోడు 2015 అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీ సాక్షి గా అమరావతి రాజధాని అంటూ నాటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. ఇక 2019 ఎన్నికల ముందు సాక్ష్యాత్తు వైస్ జగన్ మోహన్ రెడ్డే వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిగా అమరావతిని త్వరిత గతిన అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇక 2019 – 2024 మధ్య సమయంలో అమరావతి విషయంలో జగన్ మాట తప్పి మడం తిప్పి చేసిన రాజకీయం లేదు, కూల్చివేసిన నిర్మాణాలు ఇప్పటికి ఏపీ చరిత్రలో ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే అమరావతి పై సాక్షి విష ప్రచారాలు, దానికి తోడు నీలి మీడియా అసత్య కథనాలు రాజధాని పై వైసీపీ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలు కు కళ్ళముందు సాక్ష్యాత్కరింప చేస్తూనే ఉంది.

అటువంటి వైసీపీ ఇప్పుడు తిరిగి అదిఅక్రం కోసం రాజధాని ఇక్కడే, ముఖ్యమంత్రిగా జగన్ ఇక్కడే అంటూ ఇచ్చే ప్రకటనలను ఏపీ ప్రజలు విశ్వసిస్తారా.? లేక మిమ్మల్ని నమ్మలేం దొర అంటూ దూరం పెడతారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

23 minutes ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

43 minutes ago