
కృష్ణాజిల్లా గుడివాడలో టిడిపి మినీ మహానాడు నిర్వహించబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి వైసీపీ నేతలు ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని మండిపడుతున్నారు. ఆ కడుపు మంటతోనే వైసీపీ నేతలెవరో గుడివాడ రూరల్ పరిధిలోని బొమ్మలూరు వద్దగల ఎన్టీఆర్ విగ్రహం దిమ్మకు వైసీపీ రంగులు వేయించారు.
మహానాడు జరుగబోయే ప్రదేశానికి కేవలం కిలోమీటరు దూరంలోనే ఆ విగ్రహం ఉంది. వైసీపీ నేతలు ఎవరో టిడిపి నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టేందుకే ఈ పనిచేసి ఉంటారని అర్ధమవుతూనే ఉంది. టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వేంకటేశ్వర రావు తమ అనుచరులతో అక్కడికి వెళ్ళి వైసీపి రంగులపై మళ్ళీ పసుపు రంగువేయించి విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, “గుడివాడలో కొడాలినాని అరచాకాలకు అంతే ఉండటం లేదు. మహానాడు సందర్భంగా మేము టిడిపి బ్యానర్లు పెట్టుకొంటే వాటిపై వైసీపీ జెండాలు కట్టిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం దిమ్మకు వైసీపీ రంగులు వేయించి పైశాచికానందం పొందుతున్నారు.
కొడాలి నాని చేస్తున్న ఇటువంటి వికృత చేష్టలను చూసి గుడివాడ ప్రజలు సైతం అసహ్యించుకొంటున్నారు. ఇటువంటి చవుకబారు చేష్టలే ఆయనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడం ఖాయం. ఎన్టీఆర్ అభిమానినని చెప్పుకొనే కొడాలి నాని ఆయన పట్ల తీరని అపచారం చేశారు. ఆయన ఇంధుకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. గుడివాడ ప్రజలే ఆయనకు వచ్చే ఎన్నికలలో తగిన విదంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…