జనసేన: ‘మా బలం’ తెలుసు ‘మీ బలహీనత’ తెలుసు..!

టీడీపీ ,జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమకు కలిగే నష్టాన్ని ప్రజలకు, పార్టీ నేతలకు చెప్పుకోలేక రెండు పార్టీల పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి, జనసేన – టీడీపీ మద్దతుదారులను రెచ్చకొట్టి తమ పబ్బం గడుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది అధికార వైసీపీ పార్టీ.

టీడీపీ పార్టీ ఇచ్చే పదో పదిహేనో ‘సీట్ల ముష్టి’ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారని ఎద్దేవా చేసారు మంత్రి అంబటి. జగన్ తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, మానిఫెస్టో లో పొందుపరిచిన అంశాలన్నీ రాష్ట్రంలో అమలులో ఉన్నాయని జగన్ ను నెత్తినపెట్టుకున్న అంబటికి జనసైనికుల నుండి కౌంటర్ అటాక్ మొదలయ్యిది.

ADVERTISEMENT

జగన్ చెప్పిన ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దు ఏ రాష్ట్రంలో అమలుచేశారు మంత్రిగారు..? ఏపీకి అద్భుతమైన రాజధాని ఎక్కడ నిర్మించారు. లేదా మీరు మార్చిన అద్భుతమైన రాజధానిని ఎక్కడ దాచారో కాస్త చూడనిస్తారా సార్..? పోలవరం పూర్తి చేసి ఎన్ని నెలలు గడిచాయో చెప్పగలరా..? రాష్ట్రంలో మీరు అదికారంలోకి వచ్చాక చేసిన అప్పుల లిస్ట్ బయటపెట్టగలరా.? జగన్ ఏ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలుచేశారో వివరించగలరా..?

ఏపీ కి రావాల్సిన ‘ప్రత్యేక హోదా’ వైసీపీ ప్రభుత్వం ‘ఎవరికీ ముష్టి వేసిందో’ సమాధానం చెప్పగలరా..? అంటూ అంబటి కామెంట్స్ పై ప్రశ్నలతో దాడి చేస్తున్నారు జనసైనికులు. అలాగే జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసి ఎన్నికలలో ముందుకెళ్తే మాకు వచ్చే ‘బలం’ ఏమిటో మాకు తెలుసు. అలాగే ఇరు పార్టీల పొత్తు వలన మీ పార్టీకి ఉండే ‘బలహీనత’ ఏమిటో కూడా మాకు తెలుసు సార్..! అంటూ పవన్ అభిమానులు వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ వేస్తున్నారు.

పవన్, చంద్రబాబు ఇద్దరి నాయకులకు పొత్తుల మీద ఇంత నమ్మకం ఉందో సీట్ల సర్దుబాటులో కూడా అంతే క్లారిటీ ఉందనేది పవన్ వ్యాఖ్యలతో తేటతెల్లమయింది. నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్ ఎన్ని సీట్లలో పోటీచేస్తాం అన్నది కాదు ఎన్ని సీట్లలో విజయం సాధించాం అన్నదే ఇక్కడ కీలకం. జనసేన విన్నింగ్ పర్సెంటేజ్ 98 శాతం ఉండాలన్నదే లక్ష్యంగా అందరు కలిసికట్టుగా పని చేద్దాం.

ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రభుత్వంలో భాగస్వామ్యమవుదాం అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేయకుండా వాస్తవానికి దగ్గరగా ఆలోచించిన పవన్ తన లక్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నెల 8 లోపు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడానికి ఇరు పార్టీల అధ్యక్షులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

2 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

3 hours ago