
జగన్ హయంలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి?కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?అంటే ఏవీ కనబడవు. పైగా ఉన్న పరిశ్రమలు, ఐటి కంపెనీలు, చివరికి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన లూలూ గ్రూప్ వంటివాటిని పారిపోయేలా చేశారు.
చంద్రబాబు నాయుడు తెచ్చిన ఐకియా కంపెనీ కూడా వెళ్ళిపోయేదే కానీ దానిని మాత్రం ఆపగలిగారు. జగన్ ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయన మంత్రిగా కంటే ‘కోడి-గుడ్డు’తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రధాని మోడీ విశాఖ రైల్వేజోన్, బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, లకు శంకుస్థాపనలు చేసేందుకు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. ప్రధాని పర్యటనకు మంత్రి నారా లోకేష్ ఇన్‌ఛార్జీగా అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోపుగానే ఒకేసారి ఇన్ని అభివృధ్ది పనులు, ఇంత భారీ ప్రాజెక్టులు ప్రారంభం అవుతుండటంతో సహజంగానే కూటమి ప్రభుత్వం, మంత్రులు వాటి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
కనుక వాటిని ఖండించాల్సిన బాధ్యత తనపై ఉందనుకున్న మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే మీడియా ముందుకు వచ్చి అవన్నీ మా ప్రభుత్వ హయాంలో సంపాదించినవే. అప్పుడే మేము అన్ని ఏర్పాట్లు చేశాము. కానీ ఎన్నికల కారణంగా ప్రధాని మోడీ శంకుస్థాపనలకు రాలేక ఇప్పుడు వస్తున్నారు.. అంతే,” అన్నారు.
చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని రేపటి సభలో ప్రధాని మోడీ చేత చెప్పించాలని, దానికి రూ.15,000 కోట్లు కేటాయింపజేయాలని సవాలు చేశారు మన మాజీ గుడ్డు మంత్రి.
ఆనాడు చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయం కొరకు భూసేకరణ చేసి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చుకొని శంకుస్థాపన చేస్తే, ఆయన మీద ద్వేషంతో జగన్ దానిని పట్టించుకోలేదు.
కానీ విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ అది ఏర్పాటు చేయలేక, ఎన్నికలకు ముందు భోగాపురం విమానాశ్రయానికి మరోసారి శంకుస్థాపన చేసి, దానిని చూపించి గెలిచేయొచ్చని జగన్ అనుకున్నారు. అప్పుడు ఆయనకు, గుడ్డు మంత్రికి అది తప్పుగా అనిపించలేదు.
వైసీపీ చేయలేక చేతులెత్తేసిన పనులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తుంటే, అవన్నీ మేము తెచ్చినవే అని గొప్పలు చెప్పుకుంటున్నారు.
అసలు జగన్ 5 ఏళ్ళ పాలనలో ఏం చేశారంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు..అప్పులు చేశారు.. బటన్ నొక్కారు… సంక్షేమ పధకాల పేరుతో ఓటర్లకు దానిని పంచి పెట్టారు. అంతే తప్ప ఏనాడూ పారిశ్రామిక, ఆర్ధిక, మౌలిక వసతుల అభివృద్ధిని పట్టించుకుందీ లేదు కనీసం.. వాటి గురించి ఆలోచించిందీ లేదు.. అందుకే కదా ప్రజలు 175 అడిగితే 11తోనే సరిపెట్టారు?అప్పుడే మరిచిపోతే ఎలా గుడ్డూ?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…