Telugu

అమరావతి లెక్కలు మాట్లాడితే పోయేది వైసీపీ పరువే!

చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో జగన్‌ అమరావతి రాజధానిగా వద్దనుకున్నారు కనుక లక్షల కోట్ల విలువైన అమరావతిని 5 ఏళ్ళు నిర్ధాక్షిణ్యంగా పాడుపెట్టేశారు. దాని వలన జరిగిన నష్టమే సుమారు రూ.3 లక్షల కోట్లు వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ వ్యయాల గురించి వైసీపీ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

ADVERTISEMENT

అమరావతి వద్దనుకొని రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన వైసీపీకి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదనే చెప్పొచ్చు. కానీ సీఆర్‌డీఏ అమరావతిలో రూ.4,688.82 కోట్లు అంచనా వ్యయంతో 5 ఐకానిక్ టవర్లు నిర్మించేందుకు టెండర్లు పిలవడంపై వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కతోంది.

2018లో ఇవే భవనాలు నిర్మించేందుకు రూ.2,271.14 కోట్లకు అప్పగించగా, ఇప్పుడు కమీషన్లకు కక్కుర్తి పడి వాటి అంచనాని రూ.4,195.51 కోట్లకు పెంచేసిందని ఆరోపించింది. పెంచిన రూ.1,924.37 కోట్లు ముఖ్య నేత జేబులోకి వెళ్ళిపోతుందని ఆరోపించింది.

అంటే ఒకవేళ జగన్ ఆనాడే వాటి నిర్మాణాలు మొదలుపెడితే రూ.2,271.14 కోట్లకు పూర్తయ్యేవని వైసీపీయే చెపుతోంది. కానీ జగన్ ఐదేళ్ళు వృధా చేయడంతో భవన నిర్మాణా వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయింది.

ఒక స్థలం లేదా ఇల్లు ధర, నిర్మాణ వ్యయాలు 5 ఏళ్ళలో ఎంతగా పెరిగిపోతాయో అందరికీ తెలుసు. అటువంటప్పుడు 39 అంతస్తులతో నాలుగు టవర్లు, 49 అంతస్థులతో ఒక టవరు నిర్మించించాలంటే నిర్మాణ వ్యయం పెరిగిపోకుండా ఉంటుందా?

జగన్ నిర్వాకం వలననే రాష్ట్రంపై ఇంత అదనపు భారం పడుతుంటే, దానిని కప్పిపుచ్చుకోవడానికి కమీషన్ల కోసం అంచనా వ్యయం పెంచారంటూ అతితెలివిగా వాదిస్తుండటం సిగ్గుచేటు.

నాడు సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభ, సచివాలయం, హైకోర్టులకు తాత్కాలిక భవనాలు నిర్మాణానికి వేలకోట్లు ఖర్చు చేసి, ఇప్పుడు మళ్ళీ వేలకోట్లు ఖర్చు చేసి కొత్తవి నిర్మిస్తున్నారని వైసీపీ సొంత మీడియా మరో ఆరోపణ చేసింది.

కానీ నాడు చంద్రబాబు నాయుడు వాటిని నిర్మించడం వల్లనే జగన్ ప్రభుత్వం అక్కడి నుంచి పాలన సాగించగలిగింది. మరో మూడేళ్ళ తర్వాత కొత్త టవర్లు నిర్మాణ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చే వరకు కూడా తాత్కాలిక భవనాలనే ఉపయోగించుకోవలసి ఉంటుంది కదా?అంటే సుమారు 10-12 ఏళ్ళ పాటు వాటిని వినియోగించుకుంటున్నారు కదా?

అవి తాత్కాలిక భవనాలని చెప్పినప్పటికీ అన్ని వేలకోట్లు ఖర్చు చేసి ఎందుకు అంత ధృడంగా నిర్మించారంటే, భవిష్యత్‌లో వాటిని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా మార్చుకొని ఉపయోగించుకునేందుకే అని ఆనాడే చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం వైసీపీ మర్చిపోయిన్నట్లు విమర్శలు గుప్పిస్తోంది.

అయినా జగన్ తన కుటుంబం కోసం రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఋషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం వైసీపీకి తప్పుగా అనిపించలేదు. కానీ మరో వంద సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజలు గర్వపడేలా సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాలను నిర్మిస్తుంటే వైసీపీకి అంతా తప్పుగా కనిపిస్తోంది!

అమరావతి గురించి మాట్లాడేందుకు నైతిక హక్కు కూడా లేని వైసీపీ, దాని సొంత మీడియా అమరావతిపై విషం కక్కుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. ఊహించిందే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…

7 minutes ago

Egilivaranga From Bhogi: A Soulful, Lively Folk Song

Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…

24 minutes ago