
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విచారణల పర్వం నడుస్తుంది అన్నట్టుగా ఏపీలో లిక్కర్ కేసు, తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసు సంచలంగా మారాయి. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తాలూకా నేతలు లిక్కర్ కేసులో విచారణలు ఎదుర్కొంటు జైళ్లకు – బైళ్లకు మధ్య ఊగిసలాడుతున్నారు.
ఇక తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం తాలూకా ముఖ్య నేతలు ఫోన్ టాపింగ్ కేసులో విచారణ దశలో ఉన్నారు. అయితే వారు ఆ దశను దాటి కేసులు – అరెస్టుల దశకు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో.? అసలు ఆ సందర్భం ఇప్పట్లో వస్తుందో రాదో కూడా ఇప్పుడే చెప్పలేం.
కానీ వైసీపీ లో మాత్రం ఇప్పటికే రాజ్ కసి ‘రెడ్డి’, ముప్పిడి అవినాష్ ‘రెడ్డి’, సజ్జల శ్రీధర్ ‘రెడ్డి’, చెవిరెడ్డి భాస్కర్ ‘రెడ్డి’, మిథున్ ‘రెడ్డి’ వంటి నేతలు అరెస్టయ్యారు. అందులో మాజీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిలు మీద బయటకు రాగ తాజాగా నేడు ఈ కేసులో మరో ఇద్దరు వైసీపీ రెడ్డి గార్లకు హై కోర్ట్ బెయిలు మంజూరు చేసింది.
అందులో సజ్జల శ్రీథర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడి కి ఏపీ హై కోర్ట్ నుంచి బెయిలు లభించింది. ఇక కసిరెడ్డి, అవినాష్ రెడ్డి బెయిలు పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. ఇక వైసీపీ మాజీ రాజ్యసభ నేత విజయ సాయి ‘రెడ్డి’ సైతం ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు.
అలాగే తెలంగాణలో సంచలంగా మారిన ఫోన్ టాపింగ్ కేసులో సైతం ముందుగా బిఆర్ఎస్ ముఖ్య నేతలు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు విషయానికొస్తే, ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రులు హరీష్ ‘రావు’, తారక రామా’రావు’, మాజీ ఎంపీ సంతోష్ ‘రావు’ సిట్ ముందు విచారణకు హాజరుకాగా తాజాగా నేడు సిట్ మాజీ ముఖ్యంమత్రి చంద్ర శేఖర్ ‘రావు’ కి సైతం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందించింది.
ఇలా ఏపీలో వైసీపీ రెడ్డి గార్లు … తెలంగాణలో బిఆర్ఎస్ రావు గార్లు అధికారుల నోటీసులతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచారణతో ఆత్మ గౌరవం పేరుతో పోరాటాలు చేస్తున్నారు. మరి ఇందులో ఎవరి పోరాటాలకు ప్రజా మద్దతు దక్కుతుందో…ఎవరి పోరాటాలను ఆయా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తాయో చూడాలి..!
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…