Telugu

వైసీపీ లో ఇంటి వైద్యానికి మందు లేదా.?

వైసీపీ 174 సీట్లతో బలమైన ప్రభుత్వం గా ఉన్న కూటమి పై రప్ప రప్ప అంటూ రెచ్చిపోతుంది, తగ్గేదెలా అంటూ తెగబడుతుంది. అలాగే రాష్ట్రంలో అనేక అంశాల గురించి, వివాదాల మీద స్పందిస్తుంది. ఇక వైసీపీ పార్టీ తరుపున జగన్ ఓదార్పు యాత్రలు, పరామర్శ పర్యటనలు చేస్తున్నారు. కానీ అదే వైసీపీ తన సొంత పార్టీ నాయకుల సమస్యల మీద వివాదాల మీద పెదవి విప్పలేకపోతుంది.

ఉదాహరణకు సాయికృష్ణ లాకప్ డెత్ కి న్యాయం కావాలి అంటూ గళం విప్పిన వైసీపీ, వైసీపీ వివేకా దారుణ హత్యకు న్యాయం కావాలి అంటూ పోరాడుతున్న సునీత సమస్య పై పెదవి విప్పలేకపోతుంది. అక్కడ సాయికృష్ణ కుటుంబాన్ని బాధితులుగా ప్రచారం చేస్తున్న వైసీపీ ఇక్కడ మాత్రం సునీత కుటుంబాన్ని దోషిగా చిత్రీకరిస్తుంది.

ADVERTISEMENT

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్యల మీద చూపించే సానుభూతి, వైసీపీ జోగి కోడలి మేఘన మీద చూపించలేకపోతుంది. అక్కడ పవన్ ను దోషి అంటూ నిందిస్తున్న వైసీపీ ఇక్కడ జోగి కుటుంబానికి మద్దతుగా నిలుస్తుంది.

అలాగే పవన్ పై మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత దాడి చేసిన వైసీపీ దువ్వాడ శ్రీనివాస్, మాధురీ విషయంలో సైలెంట్ అయిపొయింది. ఎదుటివారికి ఇన్ని నీతి సూక్తులు, గీతాభోధనలు చేస్తున్న వైసీపీ సొంత పార్టీ నేతలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.

వైసీపీ నాయకుల విషయంలో, ఆ నాయకుల కుటుంబ వివాదాల అంశంలో వైసీపీ సొంత వైద్యం చెయ్యలేకపోతుందా.? తమకు అన్యాయం జరిగిందని, జరుగుతుందని వైసీపీ నాయకుల సొంత కుటుంబ సభ్యులే రోడ్డెక్కుతున్నా, న్యాయం కోసం న్యాయస్థానం మెట్లెక్కుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం సదరు నేత మీద చర్యలు తీసుకోలేకపోతుంది వై.?

నాటి వివేకా దారుణ హత్య విషయంలోనూ వైసీపీ ఇదే మాదిరి హత్యారోపణలు ఎదుర్కున్న వైసీపీ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా తిరిగి అతగాడికే కడప ఎంపీ సీటు కట్టబెట్టింది. అయితే అవినాష్ మీద వివేకా హత్యారోపణలు చేసింది, చేస్తుంది కూడా స్వయానా వివేకా కుమార్తె, జగన్ సోదరి సునీత కావడం ఇక్కడ కొసమెరుపు.

తన తండ్రి గొడ్డలి వేటు వెనుక అవినాష్ హస్తం ఉందంటూ గత కొన్నేళ్లుగా సునీత తన వాదన ప్రజల ముందు వినిపిస్తూనే న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయినా కూడా వైసీపీ తన సొంత పార్టీ నేత పై వస్తున్న ఆరోపణలను తుడిచిపెట్టేలా ఎటువంటి మందు ఇవ్వలేకపోతుంది.

ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా వైసీపీ సొంత వైద్యం చెయ్యలేకపోయిందనే విమర్శలు ఎదుర్కొంది. దువ్వాడ శ్రీను, మాధురిల వ్యవహారం తో దువ్వాడ శ్రీను సతీమణి వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు తమకు అన్యాయం జరుగుతుందంటూ మీడియా ముందు తమ గోడు వెళ్లపోసుకున్నా వైసీపీ అధిష్టానం చెలించలేదు.

చివరికి వారిద్దరి వ్యవహారం పార్టీకి రాజకీయంగా నష్టం చేకూరుస్తుందని భావించిన వైసీపీ దువ్వాడ శ్రీను ని పార్టీ నుంచి పేరు కు మాత్రమే సస్పెండ్ చేస్తూ ఇప్పటికి ఆయనను వైసీపీ నాయకుడి జాబితాలోనే లెక్కకడుతుంది. తమ పార్టీ నేత వలన ముగ్గురు మహిళలు తమకు అన్యాయం జరుగుతుంది అంటూ గొంతెత్తినా దువ్వాడ కు వైసీపీ సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనే భావన ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది.

ఇక తాజాగా జోగి రమేష్ కుటుంబ వివాదం. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కారణంగా తన జీవితం నాశనం అయ్యిందంటూ జోగి కోడలు మేఘన ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చారు, ప్రభుత్వ పెద్దలను కలిసారు, చివరి ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ సైద్ అబ్దుల్ నజీర్ ని కలిసిన మేఘన తనకు జోగి కుటుంబం నుంచి ప్రాణ హాని ఉందంటూ తనకు తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి భద్రత కావాలంటూ వినతి పత్రం అందించారు.

ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం తన సొంత తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల నుంచి ఆరోణలు ఎదుర్కొటున్నారు. ఇలా వైసీపీ పార్టీలో అధినేతల నుంచి నాయకులుగా, మాజీ మంత్రులు గా ఉన్న నేతల కుటుంబాల నుంచి వారి ఇంటి మహిళలు తమకు అన్యాయం జరుగుతుందని, తమ ప్రాణాలకు రక్షణ లేదని ఇలా బహిరంగంగా గళం విప్పుతున్నా వైసీపీ మాత్రం తమ నాయకులకు సరైన ఇంటి వైద్యం చెయ్యడంలో వెనకబడుతుంది వై.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Yami Gautam’s Craziest Role? Hattrick Success Loading?

Yami Gautam is stepping into a rather unusual space with Nayyi Navelli, and the teaser…

7 minutes ago

Sardar2 Shows Canceled: Such Brutal Response Unheard of?

Sardar 2 was expected to be a solid comeback opportunity for Karthi, especially after the…

38 minutes ago