అమరావతి ఎంత నిజమో…ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అంతేనా..?

2019 ఎన్నికలలో ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని అనే రెండు ముఖ్యమైన ఏజెండాలతో ప్రజల ముందుకెళ్లిన జగన్ ఒక్క ఛాన్స్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే ఆ వచ్చిన ఒక్క ఛాన్స్ ప్రత్యేక హోదా కోసం కాదు, అమరావతి రాజధాని కోసం కాదనేది తెలుసుకోవడానికి ఏపీ ప్రజానీకానికి ఎంతో సమయం పట్టలేదు.

నా ఇల్లు ఇక్కడే రాజధాని ఇక్కడే, అధికార టీడీపీ చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజధానికి 30 వేల ఎకరాలు కాదు అంతకంటే ఎక్కువ కావాలి అంటూ అటు అసెంబ్లీ లోను ఇటు ఎన్నికల ప్రచారంలోనూ హోరెత్తించిన జగన్ 2019 లో ప్రజల నమ్మకాన్ని చుడగొన్నారు.

ADVERTISEMENT

అయితే తన ఇంటికే నిప్పటించుకునే వ్యక్తిత్వం జగన్ ది అనేది ప్రజావేదిక కూల్చివేతలో నిర్దారించుకున్న రాజధాని ప్రాంత వాసులు మూడు రాజధానులతో మొదలు పెట్టిన మూడు ముక్కలాటతో ఒక నిర్ణయానికి వచ్చారు. తాము ఒక వైసీపీ అనే ఊబిలో పడిపోయామని, బయటపడడానికి మరో ఐదేళ్లు వేచి ఉండాల్సిందే అంటూ తమ హక్కుల కోసం గత ఐదేళ్లుగా రోడ్ల మీదే జీవితం కొనసాగించారు అమరావతి రైతులు.

అయితే భూములు వారివే, సమస్య వారిదే అన్నట్టు వ్యవహరించిన ప్రజలందరికీ ఇప్పుడు అదే పరిస్థితి రానుంది అనేది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా తెలివస్తుంది అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఈసారి కూడా వైసీపీ కి ఓటేసి మరో అవకాశం ఇస్తే ఇక మీ భూముల మీద హక్కు ప్రభుత్వానిదే అవుతుంది. దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశం కూడా లేకుండా తనకు అనుకూలంగా పకడ్బందీగా చట్టాన్ని రూపొందించాడు జగన్ అంటూ బాబు, పవన్ లు ప్రజలకు వివరిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఓ వర్గం ప్రజలు ఈ చట్టం పై అభద్రతా భావనలోకి వెళ్లిపోయారు . కూటమి ప్రచారంతో వైసీపీ ఢిపెన్సు లోకి వెళ్లిపోవడంతో స్వయంగా జగన్ రంగంలోకి దిగి ప్రజలలో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. రైతులకు తమ భూములపై పూర్తి హక్కు కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం, ప్రతిపక్షాలు ఈ చట్టంతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు నేను భూములు ఇచ్చే వాడినే కానీ లాక్కునే వాడిని కాదు నన్ను నమ్మండి అంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే 2019 లో కూడా జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా మార్చేస్తారు అంటూ అపట్లో బాబు పదేపదే ప్రజలను వారించారు అయినా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అలాగే ఇప్పుడు 2024 లో కూడా జగన్ కు మరో అవకాశం ఇస్తే మీ భూములు లాక్కుంటాడు అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పుడు బాబు, పవన్ ల హెచ్చరికల పై అప్రమత్తమైన ప్రజలు ‘నువ్వే మా నమ్మకం జగన్’ అంటారా..? లేదా అనేది మరో నెల రోజులలో తేలిపోనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

6 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

6 hours ago