
వైసీపి మంత్రులలో బొత్స సత్యనారాయణ వంటి అతి కొందరు మాత్రమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారి పార్టీలపై విమర్శలు చేసేటప్పుడు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడుతూ మాట్లాడేవారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అధికారం అనుభవించిన బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగానే వైసీపిలో చేరి మళ్ళీ మంత్రి పదవి సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఆ అవకాశం లేనప్పటికీ టిడిపి కూటమి ప్రభుత్వం వలన ఇబ్బందులు రాకూడని ముందే జాగ్రత్త పడుతున్నారో ఏమో… మెల్లగా చంద్రబాబు నాయుడుని పొగడటం మొదలుపెట్టారు. పింఛన్ సొమ్ము పెంచిఓ 1వ తారీకు నుంచే అందించడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం మారినప్పుడు యూనివర్శిటీల వైస్ ఛాన్సిలర్లను రాజీనామా చేయమని కోరడం లేదా మార్చడం సహజమేనని, దీనిని రాజకీయ కక్ష సాధింపుగా భావించనవసరం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు.
రాష్ట్ర విభజన కంటే 5 ఏళ్ళ జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందనే వాదనలపై రాబోయే రోజుల్లో లెక్కల్లో తెలుస్తుందని అన్నారు. ఆనాడు తమ వైసీపి నేతలు టిడిపి కార్యాలయాలపై దాడులు చేయడం తప్పే అని భావిస్తున్నానని, టిడిపి కూడా అదే తప్పు చేయకూడదని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం చాలా ముఖ్యం కనుక అధికార, ప్రతిపక్షాలు రెండూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు బొత్స సత్యనారాయణ.
విద్యారంగంలో సంస్కరణలతో కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే అని కానీ ఎప్పుడు ఏ రంగంలో సంస్కరణలు చేసిన అటువంటి ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిచలేకపోయానని అందువల్లే వారు తనపై ఆగ్రహించారు తప్ప వారితో తనకు ఎటువంటి శతృత్వం లేదన్నారు బొత్స సత్యనారాయణ.
తాను ఎప్పుడు మంత్రిగా పనిచేసినా తనపై ఏదో ఓ అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, ఇప్పుడు కూడా వచ్చాయని, కానీ నిజం నిలకడ మీదే తెలుస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఎన్నికలలో వైసీపి ఓటమికి ఈవీఎంలే కారణమని అవి టిడిపి చేతిలో శకుని పాచికల్లా మారాయని జగన్మోహన్ రెడ్డి అంటుంటే, బొత్స సత్యనారాయణ మాత్రం ప్రజలకు తమ పరిపాలన, విధానాలు, ఆలోచనలు నచ్చనందుకే తమని తిరస్కరించారని నిర్మొహమాటంగా ఒప్పేసుకున్నారు.
బొత్స సత్యనారాయణ టిడిపి కూటమికి అనుకూలంగా మాట్లాడుతూ తనను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇమ్మనమని అడగలేరు కానీ తనను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేసిన్నట్లే భావించవచ్చు.
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…