Telugu

జగన్‌ చెల్లిని వద్దనుకుంటే ముద్రగడ…

తెలుగులో ‘సహవాస దోషం’ అనే మాట అప్పుడప్పుడు వినపడుతుంటుంది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వారి ప్రభావం మనపై ఎంతో కొంత పడుతుంది.

జగన్‌తో సహవాసం చేసిన వారందరూ ఏదో రోజు పోలీస్ స్టేషన్‌, కోర్టు మెట్లు ఎక్కక తప్పదని, కొందరు జైలుకి కూడా వెళ్ళక తప్పదని నిరూపితమవుతూనే ఉంది.

ADVERTISEMENT

శని ప్రభావం నుంచి పరమేశ్వరుడంతటి వాడే తప్పించుకోలేకపోయినప్పుడు, ముద్రగడ పద్మనాభ రెడ్డి తప్పించుకోగలరా?

అయన 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరనంతవరకు కాపుల హక్కుల కోసం పోరాడిన పెద్దాయనగా సమాజంలో చాలా గౌరవ మర్యాదలు పొందుతుండేవారు. కానీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆయన గ్రహస్థితి మారిపోయింది. డౌన్ ఫాల్ మొదలైంది.

అంతకాలం పెద్ద మనిషిగా ఎంతో హుందాగా వ్యవహరించిన అయన పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ని ఓడించే టాస్క్ తీసుకోవడంతో అనుచిత వ్యాఖ్యలు చేయక తప్పలేదు.

అయన శపదం కారణంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ… పద్మనాభ రెడ్డిగా మారారు. జగన్‌ ఆయనని వాడుకొని ఎన్నికల తర్వాత పులిహోరలో కర్వేపాకులా పక్కన పడేశారు.

అప్పటి నుంచి వైసీపీలో ఆయనని పలకరించేవారే లేరు. పైగా చేజేతులా కాపు సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయారు.

ఆస్తుల కోసం జగన్‌ తల్లిని, చెల్లిని వదులుకుంటే, జగన్‌ కోసం ముద్రగడ తన కాపు సమాజాన్ని, పేరుని చివరికి సొంత కుమార్తె క్రాంతిని వదులుకున్నారు. ఇవన్నీ శని ప్రభావమే కదా?

ముద్రగడ అస్వస్థతకి గురవడంతో కాకినాడలో ఓ ఆస్పత్రిలో చేరారు. తండ్రిని పరామర్శించేందుకు కూతురు క్రాంతి రాగా ఆమెను చూసేందుకు ముద్రగడ ఇష్టపడలేదు.

ఆయనకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి చూసేందుకు వస్తే తనని దూరం పెట్టారని ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య చికిత్స కొరకు ముద్రగడ పద్మనాభ రెడ్డిని ఆయన కుమారుడు హైదరాబాద్‌ తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. తండ్రి కాదన్నా పలకరించేందుకు కూతురు క్రాంతి వచ్చారు. కానీ ఆయనని ఎన్నికలలో పావుగా వాడుకొని జగన్‌ మాత్రం రాలేదు. ఎప్పుడు వస్తారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

6 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

7 hours ago