
వైసీపీ పార్టీ ఘోర ఓటమికి గల కారణాలు ఇవేనంటూ కొంతమంది వైసీపీ నేతలు మీడియా ముందు బాహాటంగానే జరిగిన విధ్వంసాన్ని, చేసిన తప్పులను ఒప్పుకుంటున్నప్పటికీ తిరిగి మళ్ళీ అదే తరహా రాజకీయమే చేస్తున్నారు.
ఉదాహరణకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, మాజీ ఎంపీ భరత్ వంటి వారు తమ అధినేత ఒంటెద్దు పోకడలు, తమ నోటి దూలే తమ కొంప ముంచిందని బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీనూ ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే పంథాలో ముందుకెళుతున్నారు.
ముఖ్యంగా అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని విషయానికి వస్తే వీళ్ళకి పదవి పోయినా పొగరు తగ్గలేదు. అప్పుడు బాబు కి మాజీ ముఖ్యమంత్రి అనే విలువ ఇవ్వలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అనే గౌరవం ఇవ్వడం లేదు. ఓటమితో వైసీపీ నాయకులు చాల మంది సైలెంట్ అయినా ఈ సోకాల్డ్ నేతలు మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదు.
ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ మీద అదే నోటి దూల వ్యాఖ్యలు చేస్తూ ప్రజల చేత చివాట్లు తింటున్నారు. గత ఐదేళ్లు అధికారాన్ని చేతులో పెట్టుకుని తమ శాఖల మీద ప్రజలకు సమాధానం చెప్పలేక పోయిన ఈ మాజీ మంత్రులంతా ఇప్పుడు మాత్రం అన్ని శాఖల మీద ప్రశ్నించడానికి, ఆ శాఖల మంత్రులను విమర్శించడానికి తెగ ఉచ్చుకథ చూపిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఆ ప్రశ్నించే విధానమే ఇక్కడ సమస్య. ఇలా నోటికి పని చెప్పడం వల్లే ఇప్పుడీ పరిస్థితి అంటూ చెప్పుకుంటూనే మళ్ళీ ఆ నోటికి తాళం వేయలేకపోతున్నారు ఈ మాజీలు. నాడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రత్యర్థి పార్టీల నేతలను నోటికి వచ్చిందల్లా వాగుతూ అధినేత మెప్పు సంపాదించొచ్చని, తద్వారా ఎదో ఏ ఒక మంత్రి దక్కించుకోవచ్చు అనే ఆశతో అలా చేసి ఉన్నప్పటికీ దాని ఫలితం చూసాక కూడా మాజీ మంత్రుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.
గత ఐదేళ్లు బాబు ని తిట్టడమే ఒక యజ్ఞంలా పెట్టుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడు తెలివిగా సైలెంట్ అయ్యారు. కానీ ఈ తలతిక్క నాయకులు మాత్రం తమ అతి తెలివి చూపిస్తున్నారా.? లేక అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారా.? అనేలా ప్రవర్తిస్తూ ప్రజలలో మరోమారు బకరాలయ్యేందుకు మీడియా ముందుకొస్తున్నారు.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…