ఒక్కో సౌమ్యుడు… ఒక్కో ఆణిముత్యం..!

అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ల పాటు ప్రజలను పక్కన పెట్టి, పరదాలను నమ్ముకున్న ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించిన జగన్ మోహన్ రెడ్డి, అధికారం పోయిన వెంటనే ప్రజలు, ప్రెస్ మీట్ లతో చేస్తోన్న హడావుడి తెలియనిది కాదు.

ADVERTISEMENT

కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు ముగిసి ఇంకా కుదురుకోక ముందే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జగన్ మోహన్ రెడ్డి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు? అంటే దానికి సమాధానంగా “ఒక్కో ఆణిముత్యం” వెలికి చూస్తోంది.

ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార సభలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేస్తోన్న వ్యక్తిని పరిచయం చేస్తూ, ‘సౌమ్యుడు, డబ్బులు మాత్రం అంతంత మాత్రమే, మీరు గెలిపించండి, నేను మంచి చేయిస్తాను’ అంటూ జగన్ పలికిన ప్రగల్భాలు అందరికి తెలిసిందే.

నేడు అవే మాటలను ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు’ అని గొంతెత్తిన జగన్ పార్టీ నేతలు, తమ పార్టీ పేరునే ‘వైకామ’ అని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శించే స్థాయికి చేరుకున్నారు.

జగన్ కేసులలో ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి చిత్రాలు మొదలుకుని దువ్వాడ శ్రీనివాసరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల లీలలు పార్టీ గతిని స్థితిని మార్చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఒరవడిలో బొత్సకు సంబంధించిన బ్యాంకాక్ పాత వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఈ లీలలతో పాటు అధికారంలో ఉన్నపుడు అవినీతి, అక్రమాలు చేసిన జోగి రమేష్ అండ్ కో ఇప్పుడు జైలు ఊచలు లెక్కించే పరిస్థితి. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇప్పటికే అరెస్ట్ కాగా, అంతిమంగా అక్రమాలు చేసిన వారు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలాంటి “ఆణిముత్యాలు” రాబోయే కాలంలో ఇంకెందరు రానున్నారో అని ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి “ఆణిముత్యాలు” ఉన్నారు కాబట్టే ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ తనకు తోచిన ‘డైవర్షన్ పొలిటిక్స్’ పాటిస్తున్నారు.

అసలు ట్విస్ట్ ఏమిటంటే… వైసీపీ అధినేత జగనే అందరినీ మించిన “ఆణిముత్యం”గా నిలబడతారనేది పొలిటికల్ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తోన్న మాటలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

4 hours ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

4 hours ago