Telugu

పాపం వైసీపీ… పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎంతగా ఆలోచిస్తోందో!

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో రాణిస్తారా లేదా?ఎప్పటికైనా జనసేనను గెలిపించుకొని ముఖ్యమంత్రి అవుతారా లేదా?అని ప్రజలు ఆలోచించడం సహజం. అలా జరగాలని జనసేన నేతలు, కార్యకర్తలు కోరుకోవడం సహజం. అంత పాపులారిటీ, స్టార్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి తమ పార్టీతో కలిసి పనిచేయాలని ఇతర పార్టీలు కోరుకోవడం సహజం.

ADVERTISEMENT

కానీ ఆయన గురించి అందరి కంటే ఎక్కువ ఆలోచిస్తున్నది వైసీపీ నేతలే. వారి అభిప్రాయాల ప్రకారం రాజకీయాలలో పవన్‌ కళ్యాణ్‌ విలువ సున్నా. కానీ ఆ ‘సున్నా’ ఏ అంకె పక్కన చేరినా దాని విలువ అమాంతం పదిరెట్లు, వందరెట్లు లేదా వెయ్యిరెట్లు పెరిగిపోతుంది కనుకనే వారు ఆందోళన చెందుతున్నారు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో కలిసి ఉన్నందుకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని వైసీపీ నేతలు, ఆయన టిడిపితో కలుస్తారనే భయపడుతుండటం గమనిస్తే, టిడిపి-జనసేనలది ‘డెడ్లీ-కాంబినేషన్‌’ అని, ఆ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి ఖాయమని వారు గట్టిగా నమ్ముతున్నట్లు అర్దమవుతోంది.

కనుక టిడిపి-జనసేనలు కలవకుండా ఉండేందుకు వైసీపీ సామదానభేద దండోపాయాలను ప్రయత్నిస్తోంది. ఓసారి రెచ్చగొడుతుంది. ఓసారి సవాలు చేస్తుంది. ఓసారి ఆరోపిస్తుంది. ఓసారి ఎందుకూ పనికిరాడని గాలి తీస్తుంటుంది. ఓసారి కేసులు పెట్టిస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్‌ కళ్యాణ్‌ తమ ఉచ్చులో చిక్కుకోకపోవడం వైసీపీకి చాలా ఆందోళన కలిగిస్తోంది. అలాగని వదిలేస్తే మరింత ప్రమాదం. కనుక ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కురావాలన్నట్లు ప్రయత్నిస్తూనే ఉంది.

అటువంటి మరో ప్రయత్నమే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతారంటూ ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పడం. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “పవన్‌ కళ్యాణ్‌ పదేళ్ళుగా రాజకీయాలలో ఉన్నారు. తను వినియోగించుకోవలసిన అవకాశాలను జారవిడుచుకొని, ఇతరుల కోసం పనిచేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకొంటే ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఆయన మరొకరి పల్లకీ మోయడం మానుకొని, తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజలు ఆయనని నమ్ముతారు. లేకుంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతారు,” అని అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని ఓపక్క వాదిస్తూనే ‘ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు… కానీ సరిగ్గా ట్రై చేయడంలేదని’ చెప్పడం టిడిపితో చేతులు కలపకుండా నిలువరించేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే. ఈవిదంగా వైసీపీ ఆయనను ఎగదోస్తున్నట్లు అర్దమవుతోంది.

అయితే వైసీపీని గద్దె దించడానికి జనసేన కూడా ఎన్ని వ్యూహాలైనా అమలుచేస్తుందని ముందే చెప్పిన పవన్‌ కళ్యాణ్‌, తాను ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నానని ఇదివరకే స్పష్టంగా చెప్పారు. అంటే వైసీపీ ఎత్తులను ముందే పసిగట్టి వాటికి చెక్ పెట్టారనుకోవచ్చు.

గత రెండు ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ తీరు చూసి తక్కువగా అంచనావేసిన వైసీపీ నేతలు ఆయన రాజకీయాలలో ఇంత రాటుతేలడం చూసి జీర్ణించుకోవడం కష్టమే. కానీ తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Reality: Devika Bhat’s First Look as Aalochana

Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…

24 minutes ago

Nagarjuna Surprised After Watching Itllu Arjuna

Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…

45 minutes ago