
గమనిక: చంద్రబాబుని ఎవరూ పొగడరాదు! ఇలాంటి బోర్డు బయట ఎక్కడా కనిపించకపోవచ్చు. కానీ వైసీపీలో ప్రతీ ఒక్కరి మనసులో తప్పక ఉంటుంది. కనుక తాము ద్వేషించే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఎవరు పొగిడినా వారిని కూడా వైసీపీ శత్రువులుగానే పరిగణిస్తుంది.
కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు, చంద్రబాబు నాయుడుని పొగిడినవారు ఎంత గొప్పవారైనా, ఎంత ప్రముఖులైన దూదేకినట్లు ఏకి పారేస్తుంటారు. అది కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చీఫ్ బిల్ గేట్స్ అయినా సరే!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రముఖులు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం తిరుగుతుంటారు. అంత ప్రముఖ వ్యక్తి అమరావతికి వచ్చి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలిస్తే అందుకు ఏపీ ప్రజలు గర్వపడుతున్నారు.
కానీ ఆయన రావడాన్నే జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ, అయన సిఎం చంద్రబాబు నాయుడుని పొగిడితే భరించగలదా? చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనకు తమ ప్రభుత్వం ఈ గవర్నెన్స్, ఏఐ, డ్రోన్ టెక్నాలజీలను ఏవిధంగా ఉపయోగించుకుంటుందో ప్రత్యక్షంగా చూపించారు. డ్రోన్ సాయంతో అరటి తోటలకు పురుగు మందు చల్లడం చూపించారు. ఎప్పటికప్పుడు అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంత చక్కగా వినియోగించుకుంటున్నందుకు బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడుని ప్రశంశించారు.
దీంతో వైసీపీ భగ్గుమంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ప్రెస్‌మీట్ పెట్టి “బిల్ గేట్స్ కి టీలు, కాఫీలు, సమోసాలు, కార్లు, హోటల్, ఫ్లైట్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు బయట పెట్టాలి. అసలు అయన దేనికి వచ్చాడు? రాష్ట్రానికి ఏం తెచ్చాడు? ఇచ్చాడని ఆయన మీద అంత ఖర్చు పెట్టారో చెప్పాలి,” అంటూ డిమాండ్ చేశారు.
జగన్ కళ్ళలో ఆనందం కోసం, అయన మెప్పుకోసం ఇలాంటి మాటలు మాట్లాడితే జనం నవ్వుకుంటారని వైసీపీ నేతలు ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?
Dasara is turning into another Sankranti of sorts at the Telugu box office, with several…
Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…