
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే రజనీకాంత్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష నేతను కొనియాడిన చాలు వారికీ ఎటువంటి ఆతిధ్యం లభిస్తుందో వైకాపా నాయకులు, మంత్రులు రజనీకాంత్ పట్ల ప్రవర్తించిన తీరు చూస్తే అర్ధమవుతుంది.
ప్రతిపక్షాలు బయటకు వస్తున్నాయంటే చాలు “వచ్చి తిట్టి పో” అన్నట్టు వైసీపీ నేతలు వస్తారు, ప్రతిపక్ష నేతలను తిడతారు, ఆపై వెళ్ళిపోతారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నడుస్తున్న ఆనవాయితీ ఇదే. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామజిక మాధ్యమాలలో ఒక్క పోస్టు పెట్టినా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక్క మాట మాట్లాడినా ఇక వారికీ కేసులతో సమాధానం చెపుతారు అధికారులు.., బూతులతో బదులిస్తారు వైకాపా నాయకులు.
అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మొదలుపెట్టి రాష్ట్రంలో రోడ్ల దుస్థితి వరకు తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు వరకు చేస్తున్న అవహేళన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు వినపడలేదా? కనపడలేదా?
పక్క రాష్ట్రాల అధినేతలు సొంత రాష్ట్రాన్ని అవమానిస్తూ ఇక్కడి ప్రభుత్వ విధానాల వలన రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని ఉదాహారణలతో సహా వివరిస్తుంటే ఒక్కరు నోరు మొదపరేమి.పులి బిడ్డలు భయపడ్డారా?అంటూ సామజిక మాధ్యమాలలో వైకాపా నాయకులను ఉద్దేశించి మీమ్స్ సిద్ధంచేస్తున్నారు మీమర్స్.
చంద్రబాబు, లోకేష్,పవన్ లు ప్రభుత్వ విధానాలను తప్పుపడితే ఇక కలియుగం ఇక్కడితో అంతమైపోతుందేమో అన్నట్టుగా వీళ్ళు ఇట్లా విమర్శించగానే ఆ పులిబిడ్డలు అట్లా మీడియా ముందుకొచ్చి నోటికొచ్చిందల్లా తిట్టి వెళ్లిపోతుంటారు.కానీ కేసీఆర్,హరీష్ రావు ఈ వైసీపీ ప్రభుత్వంపై, ఏపీ రాష్ట్రం పై విమర్శలు చేసి రోజు గడుస్తున్నా ఇక్కడ ఒక్కరి నోరు కదలడం లేదు.
ప్రతి విమర్శ చేయడానికి అడుగులు ముందుకు వేయడం లేదు.కేంద్ర ప్రభుత్వంతోనే యుద్ధం చేసిన మీ అధినేత కనీసం పక్క రాష్ట్రాల విమర్శలకు కౌంటర్ కూడా వేయలేని దీనస్థితిలో ఉన్నారా? లేక వారు చేసిన విమర్శలు నిజమే అని మీరు ఒప్పుకుంటున్నారా?అంటూ టీడీపీ, జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.అయితే వీరి ప్రశ్నలకు మాత్రం వెంటనే కౌంటర్ ఉంటుందని వైకాపా నాయకులు నిరూపించుకుంటారులెండి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…