
వైసీపీ అందగాళ్ళు, సౌమ్యులు, మంచివాళ్ళు…అవినీతి పరులుగా, అక్రమదారులుగా, అరాచకవాదులుగా మారి అరెస్టయ్యి జైళ్లల్లో మగ్గుతున్నారు. వల్లభనేని వంశీ, నందిగామ సురేష్, పోసాని కృష్ణ మురళి, జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, బోరుగడ్డ వంటి వైసీపీ నేతలు సైతం అనేకానేక కేసులలో అరెస్టయ్యి జైలుకెళ్లినవారే, బెయిలు మీద బయటకు వచ్చినవారే.
కానీ ఆయా నేతలందరూ బెయిలు మీద బయటకయితే వచ్చారు కానీ ప్రజా క్షేత్రంలోకి తిరగలేకపోతున్నారు, రాజకీయ వేదికలెక్కలేకపోతున్నారు, రాజకీయాలు చేయలేకపోతున్నారు.
వల్లభనేని వంశీ బెయిలు మీద బయటకొచ్చి దాదాపు రెండు నెల్లలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి మీడియా ముందు రాలేకపోతున్నారు, ప్రజా పోరాటాలు చేయలేకపోతున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలలో సైతం కనిపించని పరిస్థితులలో ఉన్నారు.
ఇక పోసాని, నందిగామ సురేష్ ఇతరత్రా నాయకులు సైతం ఇదే దుస్థితిని ఎదుర్కుంటున్నారు. నాడు ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద మీడియాలో బూతులతో రెచ్చిపోయిన పోసాని నేడు పార్టీ నేతల కు మద్దతుగా కనీసం మాటకూడా మాట్లాడలేకపోయారు.
నందిగామ సురేష్ ది ఇదే పరిస్థితి. ఇక బోరుగడ్డ జగన్ ఆదేశిస్తే రెండు నిముషాలలో ఎవరినైనా లేపేస్తా, ఎవరి కుటుంబంలోని ఆడవారినైనా అవమానిస్తారా అంటూ తెగ రెచ్చిపోయారు, నేడు కనీసం ఇప్పుడు తన ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఇప్పుడు వీరంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వైసీపీ పార్టీకి మద్దతుగా కానీ నోరు విప్పలేని పరిస్థితి.
ఇక ఇప్పుడు తాజాగా బెయిలు సాధించిన మరో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు జైలు నుంచి బెయిలు మీద విడుదల కానున్నారు. మరి ఈ మాజీ మంత్రైనా బెయిలు ను తన రాజకీయాల కోసం వినియోగిస్తారు.? తన పార్టీ బలోపేతానికి వెచ్చిస్తారు.? లేక వైసీపీ నేతల పాత చరిత్రనే పునరావృత్తం చేస్తారా.?
రుస్తుం మైనింగ్ కేసులో అరెస్టయ్యి సుమారు 75 రోజుల నుంచి నెల్లూరు జైల్లో మగ్గుతున్న కాకాని గోవర్ధన్ కు నేడు తన మీద నమోదయిన 8 కేసులకు గాను న్యాయస్థానం నుంచి బెయిలు పొందారు. దీనితో రేపు ఆయన జైలు నుండి విడుడలయ్యే అవకాశం ఉంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…