
రోజులు గడిచే కొద్దీ అమరావతి మీద వైసీపీ విష ప్రచారం ఉదృతం అవుతున్నట్టుగానే విచారణ జరిపే కొద్దీ వైసీపీ నేతల అవినీతి భాగోతం, అక్రమాల మూలాలు విస్తృతంగా భయటపడుతూనే వస్తున్నాయి.
మొన్న కసి రెడ్డి తో మొదలైన లిక్కర్ కేసు నిన్న మిథున్ రెడ్డి వరకు వచ్చేయగా ఇక నేడు మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి ఇంటి వరకు చేరింది.
మద్యం కేసులో విచారణ నిమిత్తం ఆయన హాజరు కావాలంటూ గతంలో సిట్ అధికారులు నారాయణకు నోటీసులు ఇచ్చినప్పటికీ అనారోగ్య కారణాలు చెపుతూ విచారణకు గైర్హాజరయ్యారు మాజీ మంత్రి.
దీనితో నేడు తిరుపతి జిల్లా పుత్తూరు లోని ఆయన స్వగృహానికి చేరుకున్న సిట్ అధికారులు మాజీ మంత్రికి నోటీసులు అందచేసి విచారణ నిర్వహిస్తున్నారు. అయితే విచారణ పూర్తి అయిన తరువాత ఏ క్షణంలో అయినా నారాయణ స్వామిని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో బాబు అరెస్టైన సందర్భంలో ఆయన కుటుంబం పంపే ఆహారం మీద కూడా వెటకారం చేస్తూ విమర్శలు చేసి వైసీపీ తాలూకా పైశాచికత్వాన్ని ప్రదర్శించారు నారాయణ. ఇక ఇప్పుడు అదే వైసీపీ లిక్కర్ స్కాం అవినీతి రొచ్చులో కూరుకుని అరెస్టు అంచులదాకా వచ్చారు.
కర్మ ఫలం ఎవరిని విడిచి పెట్టబోదు అనేందుకు ఇదొక నిదర్శనం. అయితే వైసీపీ అవినీతి మరకలు అంటించుకున్న నాయకుల లిస్ట్ చూడాలంటే శతనామావళి చదవాల్సిందే అన్నట్టుగా తయారయ్యింది.
వల్లభనేని వంశీ తో మొదలు పెట్టిన ఈ శతనామావళి…నందిగామ సురేష్, వర్రా రవీంద్రా రెడ్డి, బోరుగడ్డ, జోగి రాజీవ్, పిన్నెల్లి బ్రదర్స్, పోసాని కృష్ణ మురళి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కసి రెడ్డి, విజయ సాయి రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణిక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి….ఇక ఇప్పుడు నారాయణ స్వామి అన్నట్టుగా ఈ చిట్టా నిర్విరామంగా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక త్వరలో ఆ అవినీతి చిట్టాలో ఆడుదాం ఆంధ్రాలో రోజా, కొడాలి నాని, రేషన్ పంచాయితీలో పేర్ని నాని, బెదిరింపు ముడుపుల విషయంలో విడుదల రజని, పెద్ది రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, జోగి రమేష్, సజ్జల భార్గవ్, ఆర్కే, ఆర్జీవీ..ఇలా మాజీ మంత్రుల నుంచి వైసీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు, చివరికి బిగ్ బాస్ వరకు ఈ అవినీతి మరకలు అంటుతూనే వస్తున్నాయి.
వీరందరి లిస్టు చూస్తే వైసీపీ అవినీతి నాయకుల పేర్లు శతనామావళి మాదిరి 108 కి చేరువలో ఉంటాయేమో అనిపిస్తుంది. మరి వీరందరికి కూటమి ప్రభుత్వం విచారణతో అష్టోత్తరం చేసి ఊరుకుంటుందా.? లేక అవినీతి కేసు (పూజ) ను పూర్తిగా కొనసాగిస్తుందా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…