డామిట్…. ఒక్కటీ వర్కవుట్ కాలేదు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తానికే వైసీపి రంగులు వేశాము. అన్నిటికీ వైఎసార్, జగనన్న పేర్లు తగిలించాము. సంక్షేమ పధకాలతో ‘మేలు’ చేశాము కదా?

ADVERTISEMENT

వైసీపి కోసం సచివాలయాలు, వాలంటీర్లతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నాము. టిడిపి ముఖ్యనేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీశాము. అందరిపై కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పించాము. చివరికి చంద్రబాబు నాయుడుని జైల్లో కూడా వేశాము కదా?

ముద్రగడ పద్మనాభంని వైసీపిలో చేర్చుకొని పవన్‌ కళ్యాణ్‌ని తిట్టించాము… వంగా గీతకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ప్రకటించాము కదా?

కేసీఆర్‌ని చూసి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చేసుకున్నాము కదా?అయినా ఇవేవీ వర్కవుట్ కాకపోవడం ఏమిటి? రాష్ట్రంలో టిడిపిని తుడిచిపెట్టేశామనుకుంటే ఇంతగా ఎలా బలపడింది?

అప్పటికీ ‘చొక్కా మడత పెట్టి యుద్ధం సిద్దం’ అని గట్టిగానే హూంకరించాముగా? వైనాట్ 175? అని అంటే టిడిపి కూటమికి 162 సీట్లు గెలుస్తుండటం ఏమిటి? వైనాట్ కుప్పం?వైనాట్ మంగళగిరి?అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ భారీ మెజార్టీతో గెలవబోతుండటం ఏమిటి?

అంబటి రాంబాబు బాగానే డ్యాన్సులు చేశారుగా?ప్రజలకు నచ్చలేదా?కొడాలి నాని బాగానే బూతులు తిట్టాడు… అవీ జనాలకు నచ్చలేదా? పోనీ జబర్దస్త్ రోజా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని బాగానే ఎగతాళి చేశారుగా? నెలకి మూడుసార్లు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని ఆయన చెవిలో చెప్పాల్సినవి చెప్పారుగా? పల్నాడు వచ్చిన తర్వాత అనిల్ కుమార్‌ మీసాలు బాగానే తిప్పారుగా?ఎవరూ చూడలేదా?

మూడు పెళ్ళాల పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో గెలవడం ఏమిటి? గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వంశీ ఓడిపోతుండటం ఏమిటి? ఎక్కడ తేడా కొట్టింది?అయినా ఈ ఆంధ్ర ప్రజలకు బొత్తిగా కృతజ్ఞత, విశ్వాసం లేవా? ఐదేళ్ళు అప్పనంగా ఇచ్చినదంతా బొక్కి ఇలా చేస్తారా?

ప్రశాంత్ కిషోర్‌ చెప్పిన జోస్యం నమ్మలేకపోయినా ఈ ఐప్యాక్, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి 40-50 మంది సలహాదారులు డబ్బు దొబ్బి శల్యసారధ్యం ఎందుకు చేశారు?

ఇంతకీ ప్రజలు నన్ను చూసి ప్రజలు వైసీపిని తిరస్కరిస్తున్నారా? లేక వైసీపిలో చాతకాని మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి నన్ను తిరస్కరిస్తున్నారా?

అందరినీ నిందించేశాము ఇంకా ఎవరు మిగిలున్నారు నిందించడానికి?ఎవరు ముందుకు వచ్చి ఎవరిని నిందిస్తారు?

ఎవరెవరు ఎక్కడకు పారిపోవాలి? ఎక్కడ దాక్కోవాలి? ఆ ఎర్ర డైరీలో మా పేరు ఉందో లేదో ఎవరిని అడిగాలి?ఆ పేరు కొట్టించేయాలంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలి?

మోడీ కూడా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బుట్టలో పడిపోయారు. అయినా పోయి పలకరిద్దామంటే కనీసం ఎంపీ సీట్లు కూడా లేవు? ఆదుకునేవారు ఎవరు? ఇప్పుడెలా….ఎలా…ఎలా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

35 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

38 minutes ago