
మరో నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. జగన్ పాదయాత్ర సందర్భంగా వీరు టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. మరోవైపు ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ టీడీపీ కండువా కప్పుకున్నారు. మరో ఎంపీ బీజేపీ తో సఖ్యతతో మెలుగుతున్నారు. ఇవన్నీ జగన్ కు తలనొప్పులే అనుకోవాలి.
సోమవారం నుండి ఇడుపులపాయలో మొదలయ్యే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగనుంది. జగన్ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని పార్టీ తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…