దువ్వాడకేనా డాక్టరేట్? మరి మిగిలినవారికో?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే విషయం దివ్వెల మాధురితో నడుపుతున్న వ్యవహారం.

ఆమె కోసం కట్టుకున్న భార్యని పెళ్ళి వయసున్న కూతుర్లను వదిలేసిన దువ్వాడ శ్రీనివాస్, ఈ వ్యవహారం బయటకు పొక్కిన తర్వాత, ఇక నిశ్చింతగా దివ్వెల మాధురితో కాపురం పెట్టేశారు.

ADVERTISEMENT

ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్నారు. టీవీ ఛానల్స్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు తమ ఆట పాటలతో జనాలను రంజింపజేస్తున్నారు కూడా.

కనుక వైసీపీ పేరు, తమ అధినేత జగన్‌ పేరుని ఇనుమడింపపజేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌ పలువిధాలుగా సమాజసేవ చేస్తున్నందుకుగాను ఆయనకు ‘డైలీ స్ప్రింగ్స్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.

యధాప్రకారం దువ్వాడ శ్రీనివాస్, తన ప్రేయసి దివ్వెల మాధురిని వెంటబెట్టుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళి నల్లకోటు, నల్లటోపీ పెట్టుకొని గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్ అందుకున్నారు.

ఆయన సమాజ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ‘డైలీ స్ప్రింగ్స్ యూనివర్సిటీ’ ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో లేదు. పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్‌, రెజిమెంటల్ బజార్‌లో ఓ భవనంలో నాలుగో అంతస్థులో అందరికీ అందుబాటులోనే ఉంది.

వైసీపీలో అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, విడదల రజని, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంత బాబు వంటివారు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సమాజసేవ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

ఇటీవల వైసీపీని వీడిన విజయసాయి రెడ్డి కూడా యధాశక్తిన చేసిన సమాజసేవ గురించి అందరికీ తెలుసు. కానీ వీరందరూ ఏ గుర్తింపుకి నోచుకోలేదు.

కనుక వీరందరికీ కూడా ఆయా రంగాలలో చేసిన సేవలకుగాను ‘గౌరవ డాక్టరేట్’ డిగ్రీలు ఈవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నింగిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌, నేలపై ఆర్టీసీ డ్రైవర్ శివ!

ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేస్తున్నప్పుడు ఓ పక్క అతని కత్తిపోట్లు ఎదుర్కొంటూనే…

11 minutes ago

నా కుట్రలు ఫలించాయి కూటమి విచ్చినం అయ్యింది!

జీవిత చరిత్రలు వ్రాసుకునే ప్రముఖులు తమ గొప్పలు చెప్పుకోవడానికే ఇష్టపడతారు తప్ప చేసిన తప్పులు, అసమర్ధత గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.…

39 minutes ago