Telugu

వైసీపీలో నెంబర్ 1 కాపు నేత ఎవరు..?

వైసీపీ రాజకీయం మొత్తం కాపు సామాజికవర్గం కేంద్రంగానే నడుస్తుంది. అందుకోసం వైసీపీ అంబటి అరెస్టు వ్యవహారాన్ని నిత్యం వార్తలలో ఉంచేందుకు వ్యూహాలు రచిస్తుంది.

అందులో భాగంగానే అంబటి జైలు నుంచి బయట వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆయనతో ర్యాలీలు లేదా ఆయన కోసం యాత్రలు చేస్తూనే ఉంటుంది. తాజాగా అంబటి రాంబాబు ని పరామర్శించడానికి ఒకప్పటి కాపు నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన ఇంటికొచ్చారు.

ADVERTISEMENT

ఇకపనిలో పనిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేస్తూ మీడియా ముందుకొచ్చి జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు తన వంతు ప్రయత్నాలు చేసారు.

అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వైసీపీ లో కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతల సంఖ్య మెండుగానే కనిపిస్తుంది. అందులోను వారంతా కూడా జగన్ కోసం ఎంతకైనా సిద్ధం అనేవారు కావడం ఇక్కడ కొసమెరుపు.

వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది సీనియర్ మోస్ట్ కాపు నేత ముద్రగడ పద్మనాభం. గతంలో కాపు సామాజికవర్గ హక్కుల కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసిన ముద్రగడ వైసీపీ లో చేరాక అదే కాపు సామాజికవర్గ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరుతా లేకుంటే రెడ్డి గా మారతా అంటూ శపధాలు చేసి చివరికి కులమార్పిడితో వైసీపీ సేవలో తరిస్తున్నారు.

ఇక మరో వైసీపీ కాపు నేత పేర్ని నాని గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆయన తనకు తానే నేను జగన్ కి పెద్ద పాలేరు అంటూ ప్రకటించుకుని, అందుకోసం తన సొంత సామాజికవర్గ నేతల పై వ్యక్తిగత దాడులు చేస్తూ అదే కాపు కులాన్ని కించపరుస్తూ చివరికి ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించారు.

ఇక ఆ తరువాత జగన్ తో వెరీ గుడ్ అనిపించుకోవడం కోసం గుడ్డి మంత్రిగా ట్రోలింగ్ ఎదుర్కుంటున్న గుడివాడ అమర్నాథ్. ఒక మాజీ మంత్రిగా ఉండి కూడా ప్రెస్ మీట్లకు వచ్చి సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోవడం గుడివాడ స్పెషల్.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తాజాగా వైసీపీ కాపు టైగర్ గా ప్రమోషన్ పొందిన అంబటి రాంబాబు. అంబటి బూతు పురాణానికి ఆయనకు వైసీపీ లో దక్కిన గౌరవరం టైగర్. ఈ సోకాల్డ్ కాపు టైగర్ గతంలో గంట అరగంట అంటూ మీడియాలో అడ్డంగా దొరికిపోయారు.

చివరికి 2024 లో దాని మూల్యం చెల్లించుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ సోకాల్డ్ వైసీపీ కాపు నేతలంతా కూడా మీడియా ముందుకొచ్చేది మరో కాపు నాయకుడిని తమ మాటల తూటాలతో అవహేళన చెయ్యడానికి లేదా వారిని రాజకీయంగా, మానసికంగా కుంగదీయడానికే.

మరి జగన్ కోసం తమ సొంత సామాజికవర్గం నేతలను కూడా ఇంతలా అవమానించగల, కించపరచగల ఈ నాయకులలో నెంబర్ 1 వైసీపీ కాపు నేత ఎవరు అంటే అందుకోసం వైసీపీలో గట్టి పోటీనే ఉందని చెప్పాలి.

తన సొంత సామాజికవర్గం నుంచి వచ్చి పార్టీ పెట్టి రాజకీయాలలో రాణించాలి అనుకున్న పవన్ పై యుద్ధం ప్రకటించినా ముద్రగడ కి ఆ స్థానం దక్కాలా.?

లేదా అదే సామాజికవర్గం నుంచి తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వంగవీటి రాధా రాజకీయ ప్రత్యర్థితో కలయతిరుగుతున్న పేర్ని నాని ని అందుకు అర్హుడిగా ఎన్నుకోవాలా.? లేదా కాపులకు కక్కా, ముక్క, మద్యం ఉంటే చాలు అంటూ సొంత సామాజికవర్గాన్నే కించపరిచిన అంబటి రాంబాబు కి ఆ గౌరవం అందాలా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2, Ranabaali and More: A Make-or-Break Dasara

Dasara is turning into another Sankranti of sorts at the Telugu box office, with several…

11 minutes ago

Salman’s Maatrubhumi: Peace Message or BO Trouble?

Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…

41 minutes ago