Telugu

అది వైసీపి ట్రాప్… చిక్కుకుంటే మాటాష్!

టిడిపి అధికారంలోకి వస్తే వైసీపి నేతల తాట తీస్తానంటూ నారా లోకేష్‌ ‘రెడ్ బుక్’ చూపించేవారు. అది చూసి మొదట్లో వైసీపి నేతలు, వారికి వత్తాసు పలికిన అధికారులు కూడా హడలిపోయేవారు.

కానీ నెలన్నర రోజులకే ‘రెడ్ బుక్కూ లేదు.. తొక్కా లేదూ…’ అంటూ వైసీపి నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, సీబీఐ చేత విచారణ జరిపించాలని, హోమ్ మంత్రి రాజీనామా చేయాలని అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.

ADVERTISEMENT

ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి, అధికారం కోల్పోయినా వైసీపి నేతలు ఇంత దూకుడుగా వ్యవహరిస్తుండటం చూసి టిడిపి నేతలు, కార్యకర్తలే కాదు… సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియాలో ఓ నెటిజన్ స్పందిస్తూ, “ఏపీకి ఏమేమి కావాలో అన్నీ ఇస్తాము.. కానీ జగన్‌, వైసీపి జోలికి ఎవరూ పోవడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్ష విధించిందా?” అని సందేహం వ్యక్తం చేశారు.

అయితే వైసీపి వ్యూహంలో భాగంగానే టిడిపిని రెచ్చగొడుతోందని చెప్పవచ్చు. ఇప్పటికే తమపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపి దుష్ప్రచారం చేస్తోంది.

ఒకవేళ వైసీపి నేతల మాటలకు టిడిపి నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి వైసీపితో గొడవ పడితే అప్పుడు నిజంగానే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది. వాటిని నమోదు చేయడానికి వైసీపి సొంత మీడియా, సోషల్ మీడియా కాచుకు కూర్చున్నాయి కూడా.

అమరావతి, పోలవరం, పరిశ్రమలు, అభివృద్ధి అంటూ ఆలోచిస్తూ ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్న టిడిపి కూటమి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి అప్రదిష్ట పాలుజేసేందుకే వైసీపి ఈవిదంగా పద్దతిగా దుష్ప్రచారం చేస్తూ కవ్విస్తున్నట్లుంది.

కనుక వైసీపి ట్రాప్‌లో టిడిపి చిక్కుకుంటే ఇక ఇంతే సంగతులు. ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుకే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ హద్దు మీరవద్దని, వైసీపికి చట్టప్రకారమే బుద్ధి చెపుదామని చెపుతున్నారు.

వైసీపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలు, కార్యకర్తలు ఎంత ఓపికగా భరించారో అదే విదంగా ఇప్పుడు కూడా సంయమనంగా ఉండమంటే అసహనంగానే ఉంటుంది. కానీ తప్పదు. వైసీపి సంగతి సిఎం చంద్రబాబు నాయుడు చూసుకుంటారు కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BSS Haindava Teaser: Breathtakingly Spectacular

Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…

2 minutes ago

స్థానికం నేర్పిస్తున్న కొత్త పాఠాలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన... రెండు పార్టీలు…

23 minutes ago