
నాడు ఎన్నికలకు మునుపు టీడీపి-జనసేనలు పొత్తుకి సిద్ధమైనప్పటి నుంచి అవకాశం వచ్చినపుడల్లా వైసీపీ కాపు కార్డు వాడుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభాన్ని బ్రహ్మాస్త్రంలా కూటమిపై సందించింది. కానీ దాంతో ఆయన రెడ్డిగా మారి నవ్వులపాలయ్యారు.
ఆ తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కి మద్య చిచ్చు పెట్టేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్‌కి, మంత్రి నారా లోకేష్‌కి మద్య ప్రయత్నించింది కానీ వారిద్దరూ అన్నదమ్ములా కలిసిపోయారు.
కానీ ఏనాటికైనా కూటమి ప్రభుత్వాన్ని బ్రేక్ చేయాలంటే, కాపుల భుజం మీద తుపాకీ పెట్టి పేల్చుతూనే ఉండాలని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.
అందుకే మొన్న అంబటి రాంబాబు భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడుకి గురిపెట్టింది. పోలీసులు ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ మీద జైలుకి పంపించడంతో వైసీపీ వ్యూహం ఫలించింది. కనుక వైసీపీలో కాపు నాయకులందరూ భుజాలపై తుపాకులు పెట్టుకొని సిఎం చంద్రబాబు నాయుడుకి గురిపెట్టి కాల్చడం మొదలుపెట్టారు.
వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒకరు. మీడియాతో మాట్లాడుతూ, “మా కాపు నాయకుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను. కూటమిలో ఉన్నవారు మాత్రమే కాపులు. వైసీపీ ఉన్నవారు కాపులు కారన్నట్లుంది టీడీపి ధోరణి. కాపుల మద్దతుతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు కాపులను ఈవిధంగా వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని అన్నారు.
మద్యం కుంభకోణం, నకిలీ మద్యం లేదా మరేదైనా అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కక్ష సాధింపేనని వైసీపీ నేతలు వాదిస్తుంటారు.
అంబటి రాంబాబు నడిరోడ్డు మీద పోలీస్ అధికారులను , సిఎం చంద్రబాబు నాయుడు బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేస్తే, వైసీపీ ‘కాపు కార్డు’ బయటకు తీసి ఇలా వాడుతోంది.
సొంత తల్లి, చెల్లి, బాబాయ్ మొదలు ముద్రగడ, కార్యకర్తలు, వాలంటీర్లు వరకు ఎవరినైనా అవసరమున్నప్పుడు వైసీపీ వాడుకుంటుంది. తర్వాత పక్కన పడేస్తుంటుంది.
ఓ పక్క ఈవిధంగా కాపులను రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తూ మరోపక్క ‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ’ ఢిల్లీలో పార్లమెంట్ బయట వైసీపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. కనుక కూటమి ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారంలోకి రావాలని వైసీపీ ఎంతగా తహతహలాడుతోందో అర్థమవుతోంది.
కానీ అంబటి లేదా గుడివాడ మరొకరు కాపులైనంత మాత్రాన్న వారు ఎటువంటివారో, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసుకోలేనంత అజ్ఞానులు కారు కాపులు. కనుక రాష్ట్రానికి, తమ సామాజిక వర్గానికి మేలు, లాభం జరుగుతున్న ఈ సమయంలో కులచిచ్చు పెట్టాలని ప్రయత్నించే ఇటువంటి వారిని కులపెద్దలే తగిన విధంగా బుద్ధి చెప్పాలి. ప్రభుత్వమో, పోలీసులో కాదు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…