
2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి, 2019లో జగన్ నేతృత్వంలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాయి. కానీ 2019లో చంద్రబాబు నాయుడు, 2024 ఎన్నికలలో జగన్ ఘోరంగా ఓడిపోయారు. వారి పరాజయాలపై పోస్ట్‌మార్టం ఎప్పుడో పూర్తయింది.
ఈ ఏడాది వైసీపీ పరిస్థితిపై రివ్యూ చేస్తే, కొందరు అనుకుంటున్నట్లు దాని పరిస్థితి దయనీయంగా లేదనే చెప్పాలి.
జగన్ శాసనసభ సమావేశాలకు, ప్రజల మధ్యకు రాకపోవడం, నేటికీ దురహంకారంతో మాట్లాడుతుండటం ఆ పార్టీకి డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు.
కూటమి ప్రభుత్వం చాలా చురుకుగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కనుక జగన్ కూడా తన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మనసులు గెలుచుకునే విధంగా పనిచేయాలని ప్రోత్సహించాలి. అందుకు అనుగుణమైన కార్యక్రమాలు చేపట్టాలి. కానీ జగన్‌తో సహా పార్టీలో అందరూ ప్రజలు అసహ్యించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక మాటలు, కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. కనుక వైసీపీకి మరింత నష్టం తప్పకపోవచ్చు.
కానీ ఓ సినిమాలో హీరో (అల్లు అర్జున్) ‘నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో…’ అంటూ ఓ పాట పాడతాడు. ప్రియురాలు మనసులో తన గురించి ఆలోచిస్తోంది కనుకనే తనపై కోప్పడుతోంది, తనను ద్వేషిస్తోంది. కానీ అదీ ఓ రకంగా ప్రేమే అని సర్దిచెప్పుకొని సంతోషపడతాడు. జగన్, వైసీపీ నేతలు కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తున్నట్లనిపిస్తుంది.
మంచో చెడో… తాము మాట్లాడే మాటలతో, చేపట్టే కార్యక్రమాలతో ప్రజలను తమ గురించి ఆలోచింపజేస్తున్నామని భావిస్తున్నారు. అది ప్రత్యర్థులకు, ప్రజలకు నచ్చకపోవచ్చు. కానీ కూటమికి ఏకైక ప్రత్యామ్నాయంగా వైసీపీ ఉందనే విషయం అందరూ గ్రహించేలా చేయగలిగారు జగన్.
ఆయన చేస్తున్న ప్యాలస్ రాజకీయాలతో వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుస్తుందా లేదా? జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా లేదా? చెప్పడం కష్టం. కానీ ఏపీలో నేటికీ వైసీపీ తిరుగులేని పార్టీగా నిలపడంలో జగన్ సఫలం అయ్యారని చెప్పవచ్చు.
రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే అయినప్పుడు, దానిని సాధించే దిశలో ముందుకు సాగాలి. కానీ పార్టీని బలంగా ఉంచుకుంటే చాలు, అధికారం దానంతట అదే వస్తుందని జగన్ భావిస్తున్నట్లున్నారు.
ఆయన నమ్మకానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది. సాధారణంగా ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అధికారంలోకి వస్తుందనే నమ్మకమే. బహుశః ఈ నమ్మకంతోనే జగన్ తన పద్ధతిలో పార్టీని నడిపిస్తున్నారనుకోవచ్చు.
Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…
Senior actress Indraja has openly slammed the trend of holding success meets for films that…