
గత ఐదేళ్లు సాక్షి పత్రికలో విలేకరు నుంచి వైసీపీ పార్టీ సాధారణ కార్యకర్త వరకు అందరు ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతూ ప్రజల సొమ్మును జీతాలుగా భుజించారు. వారిలో జగన్ నియమించిన వందలాది మంది ప్రభుత్వ సలహాదారులు ఒకపక్కన ఉంటే వైసీపీ ఎంపిక చేసిన వేలాది మంది వాలంటీర్లు మరో పక్కన ఉన్నారు.
నాడు అవసరం లేని చోట కూడా అవకాశాన్ని వెతుకున్న వైసీపీ తమ సాక్షి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది, అప్పనంగా ప్రభుత్వ సొమ్మును పత్రిక బలోపేతానికి వాడుకుంది. ఇక పార్టీ క్యాడర్ ఉపాధి కోసం ఏకంగా వాలంటీర్ అనే ఒక ప్రభుత్వ వ్యవస్థనే సృష్టించి వేలాది మంది పార్టీ క్యాడర్ కు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు చెల్లించి పార్టీని సంస్థాగతంగా బలపరుచుకుంది.
అలాగే మోతాదుకు మించిన కార్పొరేషన్లను ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా, తమ పార్టీ నిర్ణయాలకు సానుకూలంగా అడుగులకు మడుగులొత్తే నాయకులను ఆ పదవులకు అధిపతులను చేసి వైసీపీ లో అప్పటి వరకు కొనసాగుతున్న నిరుద్యోగ సమస్యకు గత ఐదేళ్లు జగన్ చెక్ పెట్టారు.
ఇక ఇప్పుడు వైసీపీ 151 నుంచి 11కి పరిమితమయ్యింది. అంటే గతంలో జగన్ సృష్టించిన, వైసీపీ నియమించిన ఉద్యోగ అవకాశాలతో పాటుగా వైసీపీ నాయకులకు ప్రజలు కల్పించిన ఎమ్మెల్యే పోస్టులు కూడా దాదాపు పూర్తిగా ఖాళీ అవడంతో ప్రస్తుతానికి వైసీపీ అంతట నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది.
నాడు టీడీపీ , జనసేనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టె చోట మోట వ్యక్తుల నుంచి పవన్, బాబు, లోకేష్ పై నీచ విమర్శలు చేసే శ్రీ రెడ్డి, బోరుగడ్డ, వర్రా రవీంద్ర, ఆర్జీవీ వరకు తెరవెనుక వైసీపీ నీలి నీడలు దాగివున్నాయి, వారి సాహసానికి ప్రభుత్వ ఖజానా నుంచి వైసీపీ ద్వారా తగిన ఫలితం దక్కింది.
ఇలా నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేతి నిండా పనితో, నోటి నిండా బూతు విమర్శలతో బిజీ బిజీగా ఉన్న అనేకమంది వైసీపీ మద్దతుదారులు, వైసీపీ నాయకులు నేడు ఉపాధి లేక నిరాశ్రయులయ్యారు. మరి నాడు అవసరం లేని చోట అవకాశాన్ని వెతికిన జగన్ నేడు అటువంటి వారి అవసరాన్ని గుర్తించి పార్టీ తరుపున పదవులు ఇచ్చి వారికీ ఉపాధి కల్పించవచ్చుగా.?
లేకుంటే నాటి వారి సేవలకు గుర్తింపుగా నేడు వారికి కూడా వైసీపీ లో పెద్ద పీట వేయవచ్చుగా..! అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా గత ఐదేళ్లు ప్రభుత్వ సొమ్ముతో పార్టీని, సొంత మీడియాను ఆర్థికంగా బలపరుచుకున్న జగన్ నేడు పార్టీ ఓటమితో వారందరిని ఒక్కసారిగా నిరుద్యోగులుగా మార్చేసి నిరాశ్రయులుగా మార్చేశారు అనే అపవాదును మూటకట్టుకోకపోయి ఉండేవారు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…