
త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో 175/25 స్థానాలు వైసీపియే గెలుచుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత గత మూడు నెలలుగా కసరత్తు చేస్తూ ఇప్పటివరకు విడుదల చేసిన 6 జాబితాలలో శాసనసభ స్థానాలకు 67 మందిని, లోక్సభ స్థానాలకు 18 మంది పేర్లను ఖరారు చేశారు.
తాజాగా శుక్రవారం రాత్రి విడుదల చేసిన 7వ జాబితాలో ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కందుకూరు శాసనసభ నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలలో కొత్త ఇన్చార్జి (అభ్యర్ధులు)లను ఖరారు చేసి ప్రకటించారు.
కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్ని, పర్చూరు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో ఎడం బాలాజీని నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమించారు.
ఈ మేరకు శుక్రవారం రాత్రి వైసీపి ప్రకటన విడుదల చేసింది. దీంతో కలిపి మొత్తం 175 శాసనసభ సీట్లకు 69 మందిని ఖరారు చేసిన్నట్లయింది.
ఇప్పటి వరకు వైసీపి విడుదల చేసిన ఏడు జాబితాలలో
1వ జాబితా: 11 శాసనసభ ఇన్చార్జిలు.
2వ జాబితా: 24 శాసనసభ, 3 లోక్సభ ఇన్చార్జిలు.
3వ జాబితా: 15 శాసనసభ, 6 లోక్సభ ఇన్చార్జిలు.
4వ జాబితా: 8 శాసనసభ, ఒక లోక్సభ ఇన్చార్జిలు.
5వ జాబితా: 3శాసనసభ, 4 లోక్సభ ఇన్చార్జిలు.
6వ జాబితా: 6 శాసనసభ, 4 లోక్సభ ఇన్చార్జిలు.
7వ జాబితా: 2 శాసనసభ స్థానాలకు ఇన్చార్జిలను వైసీపి ఖరారు చేసింది.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…