Telugu

అమరావతి పై వైసీపీ ఆపరేషన్ విధ్వంశం: స్టిల్ కంటిన్యూ.?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర చట్ట సభలలో చట్ట బద్ధత కల్పించుకున్న అమరావతి పై వైసీపీ ఇప్పటికి తన నీలి విషాన్ని కక్కుతూనే ఉంటుంది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే అమరావతి విధ్వంసానికి నిత్యం ప్రణాళికలు వేస్తూనే వస్తుంది.

నిన్న మొన్నటి వరకు అమరావతి ఒక ముంపు ప్రాంతమని, వానలు వస్తే అమరావతి కి వరదలు వస్తాయని ప్రచారం చేసిన వైసీపీ ఇక ఇప్పుడు అమరావతి నిర్మాణ విలువ ఒక్కో చదరపు అడుగుకి 20 వేలు అంటూ ప్రచారం మొదలు పెట్టింది.

ADVERTISEMENT

బాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమ్రావతి నిర్మాణాలను చేపడుతున్నారని, రాష్ట్రంలో కేవలం ఒక్క నగర నిర్మాణానికే ఈ స్థాయి ఖర్చు అవసరమా.? అమరావతి స్థానంలో రాజధానిగా మావిగన్ ను అభివృద్ధి చేయండి అంటూ రాష్ట్ర రాజధాని పై మరోకొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది, అలాగే మీడియా, ప్రజల మధ్య ఈ ప్రతిపాదనను చర్చనీయాంశంగా మార్చింది.

అయితే టీడీపీ, కూటమి ప్రభుత్వం అమరావతి మీద వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను ఎపప్టికప్పుడు ఖండిస్తూ, ప్రజలకు అసలు వాస్తవాలను వివరిస్తూ వస్తున్నా వైసీపీ మాత్రం తగ్గేదెలా అన్నట్టుగా వారానికో కొత్త ప్రచారంతో రెచ్చిపోతూనే ఉంటుంది.

ఇక తాజాగా అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టింది. అమరావతి రైతులను రెచ్చకొట్టేలా తన ప్రచారాలను రూపొందించుకుంటుంది వైసీపీ.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు అమరావతి నిర్మాణాల కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి అందవలసిన భూ పరిహారం అందలేదని, అలాగే పరిహారం గా రైతులకు ఇచ్చే భూముల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుందంటూ కథ మొదలుపెట్టింది వైసీపీ.

అయితే ఈ కథను ప్రజలకు వివరించేందుకు సాక్షి తో పాటుగా మాజీ మంత్రి పేర్ని నాని ని కూడా రంగంలోకి దింపింది వైసీపీ. రాజధాని భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు చెరువులు, వాగులు, వంకలు వంటి ముంపు ప్రాంతాలలో ప్లాట్లు కేటాయించారని,

అలాగే నిత్యం బాబు కి భజన చేసే ABN రాధా కృష్ణ వంటి వారికేమో సచివాలయానికి కూతవేటు దూరంలో ప్లాట్ల కేటాయింపులు జరిగాయంటూ రైతులను రెచ్చకొట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది వైసీపీ. అలాగే రైతులను వర్గాలుగా చీల్చి వారి మధ్య విభేదాలు సృష్టించి కూటమి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని,

ఇది గమనించిన రైతులు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు ససేమిరా ఆంటూ అద్దుతిరుగుతున్నారంటూ సాక్షిలో, వైసీపీ సోషల్ మీడియాలో కథనాలు వండి వడ్డించడం మొదలు పెట్టింది. వైసీపీ ప్రచారం ఇలా ఉంటే అసలు వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలంటూ మంత్రి నారాయణ అమరావతి లో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

వైసీపీ అమరావతి పై కుట్రలు చేస్తుందని, అమరావతి నిర్మాణాలు కోసం సుమారు 30,753 వేల మంది రైతులు 35,017 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకు గాను రైతులకు ఇప్పటికే ప్రభుత్వం ప్లాట్లు కేటాయించడం జరిగిందని, ఇంకా కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్ల్స్ కేటాయించాలని వాటిని కూడా వీలైనంత త్వరితగతిన పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు.

వైసీపీ చేస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు, అమరావతి ప్రాంత రైతులు నమ్మోదంటూ మంత్రి నారాయణ వైసీపీ విష ప్రచారాల పై మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం వైసీపీ ని అమరావతి విషయంలో ఎంతలా వారిస్తున్నా వైసీపీ మాత్రం అలుపెరగకుండా తన విష ప్రచాలను కొనసాగిస్తూనే వస్తుంది. మరి ఇది కూటమి ప్రభుత్వం చేతకాని తనమనాలా.? లేదా వైసీపీ మొండి ముర్కత్వమనాలా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK 47 Postponement Mystery: What Is Trivikram Hiding?

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…

13 minutes ago

Sanjay Dutt Clarified But AI Changed the Question

Sanjay Dutt faced severe criticism after a recent appearance on Shekhar Suman’s show. His comments…

43 minutes ago